ఫిబ్రవరి 3, 4 తేదీల్లో గోల్ఫ్‌ టోర్నీ | golf tournament on February 3, 4 for cancer crusaders of cure foundation | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి 3, 4 తేదీల్లో గోల్ఫ్‌ టోర్నీ

Jan 20 2018 10:37 AM | Updated on Jan 20 2018 10:37 AM

golf tournament on February 3, 4 for cancer crusaders of cure foundation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘క్యాన్సర్‌ క్రూసేడర్స్‌ ఆఫ్‌ క్యూర్‌ ఫౌండేషన్‌’ ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో గోల్ఫ్‌ టోర్నమెంట్‌ జరుగనుంది. ‘క్యాన్సర్‌ క్రూసేడర్స్‌ ఇన్విటేషన్‌ కప్‌’ పేరిట నిధుల సేకరణ, అవగాహన కల్పించేందుకు 3, 4 తేదీల్లో ఈ టోర్నీని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్‌ గోల్ఫ్‌ క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టోర్నీ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సినీ నటి కాజల్‌ అగర్వాల్‌ పాల్గొని టోర్నమెంట్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

గొప్ప ఉద్దేశంతో నిర్వహించే ఈ టోర్నమెంట్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉందని కాజల్‌ అన్నారు. ఫిబ్రవరి 4న సాయంత్రం 7 గంటలకు నోవాటెల్‌లో ‘సెలెబ్రిటీ గోల్ఫ్‌ ప్లే ఆప్‌’ను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో ఎంపీ కవిత, ఐఏఎస్‌ ఆమ్రపాలి, సీఐఎస్‌ఎఫ్‌ డీఐజీ శిఖా గోయెల్, టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా, సినీతారలు, కేథరిన్, హెబ్బా పటేల్, దక్ష, తేజస్వి, మోడల్‌ షాలిని పాల్గొంటారని చెప్పారు. ఈ టోర్నీలో దాదాపు 150 మంది గోల్ఫర్లు హాజరవుతారని అన్నారు. విలేకరుల సమావేశంలో కాజల్‌తో పాటు క్యూర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు విజయ్‌ ఆనంద్‌ రెడ్డి, హైదరాబాద్‌ గోల్ఫ్‌ సంఘం అధ్యక్షులు జె. విక్రమదేవ్‌ రావు తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement