నీటి ఎద్దడి కారణంగా మహారాష్ట్రలో నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)మ్యాచ్లను వేరే చోటుకి తరలించాల్సిందేనంటూ బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో శుక్రవారం ఫ్రాంచైజీ ఓనర్లు సమావేశం కానున్నారు.
ముంబై:నీటి ఎద్దడి కారణంగా మహారాష్ట్రలో నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)మ్యాచ్లను వేరే చోటుకి తరలించాల్సిందేనంటూ బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో శుక్రవారం ఫ్రాంచైజీ ఓనర్లు సమావేశం కానున్నారు. ఈ మేరకు నాగ్పూర్, ముంబై, పుణెలో జరగాల్సిన మ్యాచ్ల కొత్త వేదికల ఎంపికపై కసరత్తు చేయనున్నారు.
పిచ్‌ల నిర్వహణ కోసం 60 లక్షల లీటర్ల నీటిని వృథా చేస్తున్నారని లోక్‌సత్తా ఎన్‌జీఓ మూవ్‌మెంట్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారించిన బాంబే హైకోర్టు.. షెడ్యూల్ ప్రకారం ఈనెల 30 తర్వాత మహారాష్ర్టలో జరిగే అన్ని మ్యాచ్‌లను తరలించాలని తమ ఆదేశాల్లో పేర్కొంది. దీంతో మే 29న జరగాల్సిన ఫైనల్‌తో సహా 13 మ్యాచ్‌లకు ఆటంకం ఏర్పడింది.