breaking news
water crises
-
భారత్ దెబ్బకు.. కాళ్లబేరానికి పాక్
-
Global Commission on Economics of Water: దారి తప్పిన జల చక్రం!
పర్యావరణంతో శతాబ్దానికి పైగా మనిషి ఆడుతున్న ప్రమాదకరమైన ఆట పెను విపత్తుగా పరిణమిస్తోంది. దాని తాలూకు విపరిణామాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. విచ్చలవిడిగా అడవుల నరికివేత, మితిమీరిన వాతావరణ కాలుష్యం తదితరాల దెబ్బకు చివరికి భూమిపై జీవకోటి మనుగడకు అత్యవసరమైన జలచక్రం కూడా గతి తప్పింది. అంతర్జాతీయ నిపుణుల సమూహమైన గ్లోబల్ కమిషన్ ఆన్ ద ఎకనామిక్స్ ఆఫ్ వాటర్ చేపట్టిన అధ్యయనం ఈ మేరకు తేలి్చంది. ‘‘చరిత్ర పొడవునా అత్యంత భారీ వాతావరణ మార్పులనెన్నింటినో తట్టుకుని నిలిచిన జలచక్రం ఇలా సంతులనం కోల్పోవడం మానవాళి చరిత్రలో ఇదే తొలిసారి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడి అతి త్వరలోనే పరాకాష్టకు చేరడం ఖాయం’’ అని బుధవారం విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది. మనిషి నిర్వాకం వల్ల చోటుచేసుకుంటున్న పర్యావరణ మార్పులే ఇందుకు ప్రధాన కారణమంటూ కుండబద్దలు కొట్టింది! ‘‘దీనివల్ల ఆహార సంక్షోభం మొదలుకుని పలు రకాల విపరిణామాలు తలెత్తనున్నాయి. వీటి దెబ్బకు త్వరలో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలే అతలాకుతలం కావడం ఖాయం’’ అని జోస్యం చెప్పింది. ఏమిటీ జలచక్రం...!? జలచక్రం భూమిపై నీటి కదలికలకు సంబంధించిన సంక్లిష్టమైన వ్యవస్థ. చెరువులు, నదులు, ముఖ్యంగా సముద్రంలోని నీరు సూర్యరశ్మి ప్రభావంతో ఆవిరిగా వాతావరణంలోకి చేరుతుంది. భారీ నీటి ఆవిరి మేఘాలుగా మారి సుదూరాలకు పయనిస్తుంది. శీతల వాతావరణం ప్రభావంతో చల్లబడి వానగా, మంచుగా తిరిగి నేలపైకి చేరుతుంది. ఈ ప్రక్రియనంతటినీ కలిపి జలచక్రంగా పేర్కొంటారు. మనిషి చేజేతులారా చేస్తూ వస్తున్న పర్యావరణ విధ్వంసం ధాటికి దీనిపై కొన్ని దశాబ్దాలుగా కనీవినీ ఎరగని స్థాయిలో ఒత్తిడి పడుతూ వస్తోంది. ఇటీవలి కాలంలో అది భరించలేని స్థాయికి చేరిందని అధ్యయనం వెల్లడించింది. దశాబ్దాల తరబడి భూమిని విచ్చలవిడిగా విధ్వంసకర విధానాలకు వాడేయడం మొదలుకుని ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాలు నీటి నిర్వహణలో కనబరుస్తున్న లెక్కలేనితనం దాకా జలచక్రం గతి తప్పేందుకు దారితీసిన పలు కారణాలను నివేదిక ఏకరువు పెట్టింది. గతి తప్పితే అంతే...! జలచక్రం గతి తప్పితే జరిగే చేటును తాజా నివేదిక కళ్లకు కట్టింది...→ కేవలం నీటి ఎద్దడి దెబ్బకు 2050 నాటికి దాదాపుగా అన్ని దేశాల జీడీపీ కనీసం 8 శాతం, అంతకుమించి తగ్గిపోతుందని అంచనా. అల్పాదాయ దేశాల జీడీపీలో 15 శాతానికి పైగా క్షీణత నమోదు కావచ్చు.→ దీని ప్రభావంతో ఏకంగా 300 కోట్ల మంది తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. చాలా దేశాల్లో పంటలూ నేలచూపులు చూస్తున్నాయి. ళీ భారీ భవనాలు తదితరాల తాలూకు ఓపలేని భారానికి తోడు భూగర్భ జల వనరులూ నిండుకుంటుండటంతో నగరాలు, పట్టణాలు నానాటికీ మరింత వేగంగా భూమిలోకి కూరుకుపోతున్నాయి. → నీటి సంక్షోభం ఇప్పటికే ప్రపంచ ఆహారోత్పత్తిని 50 శాతానికి పైగా ప్రభావితం చేస్తోంది.హరిత జలం.. అతి కీలకం చెరువులు, నదుల వంటి జలాశయాల్లోని నీటికి బ్లూ వాటర్ అంటారు మట్టి, మొక్కల్లో నిల్వ ఉండే తేమను హరిత జలం అని పేర్కొంటారు. మనం ఇప్పటిదాకా పెద్దగా పట్టించుకోని ఈ నీటి వనరును జలచక్రంలో అతి కీలకమైన పొరగా నివేదిక అభివరి్ణంచింది. ‘‘ప్రపంచ వర్షపాతంలో ఏకంగా సగానికి పైగా దీనివల్లే సంభవిస్తోంది. భూమిని వేడెక్కించే కర్బన ఉద్గారాలను చాలావరకు శోషించుకునేది ఈ హరితజలమే’’ అని తేలి్చంది. కానీ, ‘‘ఏ దేశంలో చూసినా చిత్తడి నేలలను నాశనం చేసే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. దీనికి తోడు అడవులనూ విచ్చలవిడిగా నరికేస్తున్నారు. దాంతో కర్బన ఉద్గారాలు నేరుగా వాతావరణంలోకి విడుదలైపోతున్నాయి. ఫలితంగా గ్లోబల్ వారి్మంగ్ ఊహాతీత వేగంతో పెరిగిపోతోంది. మట్టిలో, చెట్లలో ఉండే తేమ హరించుకుపోతోంది. ఇదో విషవలయం. దీని దెబ్బకు కార్చిచ్చుల ముప్పు కూడా నానాటికీ పెరుగుతోంది’’ అని నివేదిక హెచ్చరించింది.అడ్డూ అదుపూ లేని మానవ కార్యకలాపాల వల్ల భూమిపై జలచక్రంతో సహా అన్నిరకాల సంతులనాలూ ఘోరంగా దెబ్బ తింటున్నాయి. దాంతో వర్షపాత ధోరణులు విపరీతంగా మారుతున్నాయి. దేశాలన్నీ తమ నీటి నిర్వహణ తీరుతెన్నులను యుద్ధ ప్రాతిపదికన మెరుగు పరుచుకోవాలి. కాలుష్యానికి తక్షణం అడ్డుకట్ట వేయాలి. లేదంటే మానవాళి మనుగడకు ముప్పు మరెంతో దూరంలో లేదు’– రిచర్డ్ అలన్, క్లైమేట్ సైన్స్ ప్రొఫెసర్, రీడింగ్ యూనివర్సిటీ, ఇంగ్లండ్ప్రపంచ నీటి సంక్షోభం పెను సమస్య మాత్రమే కాదు. జల ఆర్థిక వ్యవస్థల్లో అత్యవసరమైన మార్పుచేర్పులకు అవకాశం కూడా. ఇందుకోసం ముందుగా నీటి విలువను సరిగా అర్థం చేసుకోవడం చాలా అవసరం. దురదృష్టవశాత్తూ చాలా దేశాల్లో అదే లోపిస్తోంది– గోజీ ఒకొంజో ఇవాలా,డైరెక్టర్ జనరల్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
వీడియో: నీళ్లు తాగాలంటే ఇంత చేయాలా.. ఎక్కడో కాదు మన దేశంలోనే..
ఎంతో మంది తమకు తెలియకుండానే నీటిని చాలా వరకు వృథా చేస్తుంటారు. ఫ్రీగా వచ్చాయి కదా అని.. కులాయి ఆన్‌చేసి కొద్దిపాటి అవసరానికి కూడా పెద్ద మొత్తంలో నీటిని పారబోస్తుంటారు. అలాంటి ఈ వీడియో తప్పనిసరిగా చూడాల్సిందే.. దేశంలో మంచినీరు దొరకని ప్రాంతాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో రాజస్థాన్ కూడా ఒకటి. కాగా, రాజస్థాన్‌లోని ఎడారి సమీపంలో నివసించే ప్రజలు మంచినీటి కోసం ప్రతీరోజు ఎంత కష్టాన్ని ఎదుర్కొంటారో ఈ వీడియోలో చూడొచ్చు. దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆఫీసర్ సామ్రాట్ గౌడ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ వీడియోలో ఎడారి ప్రాంతంలో ఉన్న ఓ బావి వద్ద ఓ వ్యక్తి కొన్ని సంచులతో చేసిన ఓ కుండలాంటి వస్తువును తయారుచేశాడు. అనంతరం.. దాన్ని బావిలోకి వదులుతాడు.. తర్వాత ఆ తాడును రెండు ఒంటెలు లాగేలా ఉన్న పరికరానికి తగిలిస్తాడు. దీంతో, ఆ రెండు ఒంటెలు తాడును తాగుతూ ముందుకు వెళ్లగానే సంచిలో నీరుపైకి వస్తుంది. అనంతరం, ఆ నీటిని పక్కనే ఉన్న ఓ సంపులో భద్రపరుచుకుంటున్నారు. ఇక, ఈ వీడియోకు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సామ్రాట్ గౌడ.. నీరు చాలా విలువైనది, చాలా జాగ్రత్తగా వాడండి అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. Water is very precious resource......use it carefully 💦 pic.twitter.com/g6UNIFwEnk — Dr.Samrat Gowda IFS (@IfsSamrat) December 1, 2022 ఈ వీడియోపై పలువురు నెటిజన్లు స్పందించారు. వీడియో జైసల్మేర్‌కి చెందినదని ఓ నెటిజన్ పేర్కొన్నారు. మరో నెటిజన్ స్పందిస్తూ.. రాజస్థాన్ బోర్డర్లో ఉన్న వారికి వేసవిలో బీఎస్ఎఫ్ జవాన్లు వాటర్ అందిస్తారని చెప్పుకొచ్చారు. మరో నెటిజన్.. అనుభవం మాత్రమే పాఠాన్ని నేర్పుతుంది. నీటి విషయంలో మనం తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అది మనిషి స్వభావం అంటూ ఘాటు కామెంట్స్ చేశారు. Only the practical experience will teach the lesson. Anything for instance as long as you get in surplus we ont realise. By the time we realise everything is over. That's human nature Sir. — T. Chandrasekar (@TChandr64295322) December 1, 2022 -
అన్నవరంలో భక్తుల అష్టకష్టాలు
-
సీఎం సొంతూరులో తాగునీటికి కటకట
చండీగఢ్: హరియాణాలోని చాలా గ్రామాలు తాగునీరు లేక అల్లాడుతున్నాయి. రాజస్థాన్ సరిహద్దుకు దగ్గర్లో గల శివాని పట్టణం అందులో ఒకటి. ఇప్పుడీ పట్టణంపై అందరి దృష్టీ పడింది. ఎందుకంటే ఆ పట్టణం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సొంతూరు కావడమే అందుకు కారణం. శివానిలోని ప్రజలు తాగునీరు లేక అల్లాడిపోతున్నారు. మంచినీటి కోసం 11 రోజులుగా సబ్ డివిజనల్ ఆఫీసు ముందు ధర్నా చేస్తున్నారు. శివాని పట్టణంలో 5000 వేల లీటర్ల నీటి ట్యాంకర్‌ను రూ.1000కి కొనుగోలు చేయాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. ఈ యేడాది తక్కువ వర్షపాతం కురవడంతో నాలుగు వేల ఎకరాల్లోని శనగ పంట ఎండిపోయిందని చెప్పారు. అసలే కష్టాల్లో ఉన్న తమకు తాగునీరు కొనుక్కోవడం భారంగా మారిందని వారు చెబుతున్నారు. ప్రభుత్వం మంచి నీటి సరఫరా ట్యాంకర్ల ముందు గంటల తరబడి వేచిచూస్తే కొద్దిపాటి నీరు దొరుకుతుందని అదే గ్రామానికి చెందిన దయానంద్ పునియా అన్నారు. పునియా ఆల్ ఇండియా కిసాన్ సభ హరియాణా యూనిట్ కి అధ్యక్షునిగా ఉన్నారు. తాము ఇప్పటి వరకు అనేక మంది అధికారులకు తాగునీరు కోసం విన్నవించామని, అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి తమ సమస్యను చెప్పాలనే ఆలోచన ఇప్పటి వరకు రాలేదనన్నారు. ఇప్పుడీ విషయాన్ని కేజ్రీవాల్ దృష్టికి తీసుకు వెళతామని పేర్కొన్నారు. -
రేపు ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ల సమావేశం
ముంబై:నీటి ఎద్దడి కారణంగా మహారాష్ట్రలో నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)మ్యాచ్‌లను వేరే చోటుకి తరలించాల్సిందేనంటూ బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో శుక్రవారం ఫ్రాంచైజీ ఓనర్లు సమావేశం కానున్నారు. ఈ మేరకు నాగ్‌పూర్, ముంబై, పుణెలో జరగాల్సిన మ్యాచ్‌ల కొత్త వేదికల ఎంపికపై కసరత్తు చేయనున్నారు. పిచ్‌ల నిర్వహణ కోసం 60 లక్షల లీటర్ల నీటిని వృథా చేస్తున్నారని లోక్‌సత్తా ఎన్జీఓ మూవ్మెంట్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారించిన బాంబే హైకోర్టు.. షెడ్యూల్ ప్రకారం ఈనెల 30 తర్వాత మహారాష్ర్టలో జరిగే అన్ని మ్యాచ్‌లను తరలించాలని తమ ఆదేశాల్లో పేర్కొంది. దీంతో మే 29న జరగాల్సిన ఫైనల్‌తో సహా 13 మ్యాచ్‌లకు ఆటంకం ఏర్పడింది. -
నీటి కోసం..కోటి తిప్పలు..!
నీళ్లు వచ్చేటప్పుడు వీధి కుళాయిల వద్ద జరిగే గొడవల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకటి రెండు గంటలే వచ్చే నీటిని సాధ్యమైనంత త్వరగా పట్టుకోవాలన్న తాపత్రయంతో పదులు.. ఇంకా చెప్పాలంటే వందల్లోనే ఉండే మహిళలు సిగపట్లు పట్టుకుంటారు. అటువంటిది 500 మందికి ఒక్క బోరే ఉంటే.. అదే అన్నింటికీ ఆధారమైతే.. రెండు మూడు గంటల్లో అందరి అవసరాలు తీరాలంటే పరిస్థితి ఎలా ఉంటుంది. ఇదిగో.. ఈ ఫొటోనే అందుకు అద్దం పడుతోంది. శ్రీకాకుళం జిల్లా నందిగాంలోని బాలికల సంక్షేమ వసతిగృహంలో ఉన్న ఈ బోరు.. దానితో విద్యార్థినులు జరుపుతున్న పోరు వివరాల్లోకి వెళితే.. ఈ వసతిగృహంలో ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న సుమారు 500 మంది విద్యార్థినులు ఉంటున్నారు. అక్కడ ఉన్నది ఒకే ఒక్క బోరు. కాలకృత్యాలు, బట్టలు ఉతుక్కోవడం.. ఇలా అన్ని అవసరాలకు ఇదే ఆధారం. మరోవైపు ఉదయం 8 గంటలకే పాఠశాలకు చేరుకోవాలి. ఈలోగానే అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. దాంతో తెల్లవారుజామున 5 గంటలకు ఈ హాస్టల్లో హడావుడి మొదలవుతుంది. బాలికల ఉరుకులు.. పరుగులు.. బోరు వద్ద పెద్ద క్యూ.. తమ వంతు వచ్చే వరకు ఉగ్గబట్టుకొని వేచి చూడటం.. 8 గంటల్లోగా తమ వంతు రాకపోతే ఉసూరుమంటూ వెనుదిరగడం.. ఇదీ ఇక్కడి విద్యార్థినుల నిత్య పోరాటం..! - ఫోటో: పీఎల్ మోహనరావు, సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం