సీఎం సొంతూరులో తాగునీటికి కటకట
													 
										
					
					
					
																							
											
						 హరియాణాలోని చాలా గ్రామాలు తాగునీరు లేక అల్లాడుతున్నాయి.
						 
										
					
					
																
	చండీగఢ్: హరియాణాలోని చాలా గ్రామాలు తాగునీరు లేక అల్లాడుతున్నాయి. రాజస్థాన్ సరిహద్దుకు దగ్గర్లో  గల శివాని పట్టణం అందులో ఒకటి. ఇప్పుడీ పట్టణంపై అందరి దృష్టీ పడింది. ఎందుకంటే ఆ పట్టణం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సొంతూరు కావడమే అందుకు కారణం.
	 
	శివానిలోని ప్రజలు తాగునీరు లేక  అల్లాడిపోతున్నారు. మంచినీటి కోసం  11 రోజులుగా సబ్ డివిజనల్ ఆఫీసు ముందు ధర్నా చేస్తున్నారు. శివాని పట్టణంలో 5000 వేల లీటర్ల నీటి ట్యాంకర్ను రూ.1000కి కొనుగోలు చేయాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. ఈ యేడాది తక్కువ వర్షపాతం కురవడంతో  నాలుగు వేల ఎకరాల్లోని శనగ పంట ఎండిపోయిందని చెప్పారు. అసలే కష్టాల్లో ఉన్న తమకు తాగునీరు కొనుక్కోవడం భారంగా మారిందని వారు చెబుతున్నారు.  ప్రభుత్వం మంచి నీటి సరఫరా ట్యాంకర్ల ముందు గంటల తరబడి వేచిచూస్తే కొద్దిపాటి నీరు దొరుకుతుందని అదే గ్రామానికి చెందిన  దయానంద్ పునియా అన్నారు. పునియా ఆల్ ఇండియా కిసాన్ సభ హరియాణా యూనిట్ కి అధ్యక్షునిగా ఉన్నారు. తాము ఇప్పటి వరకు అనేక మంది అధికారులకు తాగునీరు కోసం విన్నవించామని, అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి తమ సమస్యను చెప్పాలనే ఆలోచన ఇప్పటి వరకు రాలేదనన్నారు. ఇప్పుడీ విషయాన్ని కేజ్రీవాల్ దృష్టికి తీసుకు వెళతామని పేర్కొన్నారు.