ఎఫ్‌-3 రేసు: గాల్లోకి లేచి ఎగిరపడ్డ కారు | Formula 3 Driver Incredibly Walks Away From Terrifying Crash | Sakshi
Sakshi News home page

ఎఫ్‌-3 రేసు: గాల్లోకి లేచి ఎగిరపడ్డ కారు

Sep 8 2019 3:35 PM | Updated on Sep 8 2019 4:05 PM

Formula 3 Driver Incredibly Walks Away From Terrifying Crash - Sakshi

మోంజా(ఇటలీ):  ఇటలీ గ్రాండ్‌ ప్రి రేసులో 19 ఏళ్ల డ్రైవర్‌ అలెక్స్‌ పెరోని తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.  ఫార్ములావన్‌-3లో భాగంగా శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌ రేసులో అలెక్స్‌ పెరోని కారు ఉన్నట్టుండి గాల్లోకి లేవడం తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ల్యాప్‌లను పూర్తి చేస్తున్న సమయంలో చిన్నపాటి ఫుట్‌పాత్‌ను ఢీకొట్టిన కారు అమాంతం పైకి లేచింది. గాల్లోనే చక్కర్లు కొడుతూ సుమారు 50 మీటర్ల దూరంలో పడింది.

కాగా, డ్రైవర్‌ పెరోని సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన తర్వాత మామాలుగా లేచి మెడికల్‌ కారు దగ్గరకు వచ్చాడు. అతని ఆస్పత్రికి తరలించగా పలు పరీక్షలు చేసి ఎటువంటి ఫ్యాక్చర్స్‌ కాలేదని వైద్యులు తేల్చారు. దాంతో ఎఫ్‌-3 యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. ఈ రోజు జరిగే ఎఫ్‌-2 రేసులో సైతం పెరోని పాల్గొనాల్సి ఉండగా, ప్రమాదం కారణంగా పోటీ నుంచి తప్పుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement