విజేత శివాని | Flawless show by Sacchitt and Shivani | Sakshi
Sakshi News home page

విజేత శివాని

Dec 2 2018 1:01 AM | Updated on Dec 2 2018 1:01 AM

Flawless show by Sacchitt and Shivani - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) గ్రేడ్‌–4 జూనియర్‌ సర్క్యూట్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి అమినేని శివాని చాంపియన్‌గా నిలిచింది. న్యూఢిల్లీలోని ఆర్‌కే ఖన్నా టెన్నిస్‌ కాంప్లెక్స్‌లో శనివారం జరిగిన ఫైనల్లో టాప్‌ సీడ్‌ శివాని 6–1, 6–3తో రెండో సీడ్‌ ఎరిన్‌ రిచర్డ్‌సన్‌ (ఇంగ్లండ్‌)పై విజయం సాధించింది.

శివాని కెరీర్‌లో ఇది రెండో ఐటీఎఫ్‌ సింగిల్స్‌ టైటిల్‌. 17 ఏళ్ల శివాని ఇప్పటి వరకు ఏడు ఐటీఎఫ్‌ టోర్నీల్లో ఫైనల్‌కు చేరుకోగా ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచి, రెండుసార్లు టైటిల్‌ను సొంతం చేసుకుంది.  

Advertisement
 
Advertisement
Advertisement