ఇదో వింత ‘జంట’ | First married gay couple to compete at Olympics: 'Rio is special after | Sakshi
Sakshi News home page

ఇదో వింత ‘జంట’

Aug 9 2016 2:36 AM | Updated on Sep 4 2017 8:25 AM

ఇదో వింత ‘జంట’

ఇదో వింత ‘జంట’

ఒలింపిక్స్‌లో పెళ్లైన జంటలు బరిలోకి దిగడం వింతేం కాదు.... అయితే ఈసారి ఒలింపిక్స్‌లో ఓ జంట మాత్రం విశేషంగా ఆకర్షిస్తోంది. కారణం ఈ ఇద్దరూ మహిళలే మరి.

ఒలింపిక్స్‌లో పెళ్లైన జంటలు బరిలోకి దిగడం వింతేం కాదు.... అయితే ఈసారి ఒలింపిక్స్‌లో ఓ జంట మాత్రం విశేషంగా ఆకర్షిస్తోంది. కారణం ఈ ఇద్దరూ మహిళలే మరి. ఇంగ్లండ్ మహిళల హాకీ జట్టు సభ్యులు కేట్, హెలెన్ రిచర్డ్‌సన్ ఇద్దరూ నిజ జీవిత భాగస్వాములు. 2008 నుంచి కలిసి మెలిసి ఆడుతూ... మూడేళ్ల క్రితం ఒక్కటయ్యారు. ఇప్పటికే మూడు ఒలింపిక్స్‌లో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించిన వీళ్లిద్దరూ నాలుగో సారి మాత్రం జంటగా రియోకు వచ్చారు.

టీనేజ్ నుంచే కేట్, హెలెన్‌లిద్దరూ స్నేహితులు. 2008లో అప్పటి ఇంగ్లండ్ పురుషుల హాకీ జట్టు కెప్టెన్ బ్రెట్ గెరార్డ్‌తో కేట్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. కారాణాలేవైనా పెళ్లిదాకా రాని ఈ నిశ్చితార్థం రద్దయ్యింది. ఆ సమయంలో కేట్, హెలెన్‌ల మధ్య ఉన్న పరిచయం కాస్తా తొలుత సహజీవనంగా... తదనంతరం  వివాహ బంధంగా మారింది. మూడు పెనాల్టీలు... ఆరు గోల్స్‌గా వారి కాపురం సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement