భారత్‌ రెండో విజయం | FIH Women's Series Finals | Sakshi
Sakshi News home page

భారత్‌ రెండో విజయం

Jun 17 2019 5:39 AM | Updated on Jun 17 2019 5:39 AM

FIH Women's Series Finals - Sakshi

హిరోషిమా (జపాన్‌): అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) మహిళల సిరీస్‌ ఫైనల్స్‌ టోర్నమెం ట్‌లో భారత్‌ రెండో విజయం నమోదు చేసింది. శనివారం ఉరుగ్వేపై ప్రదర్శించిన జోరును పోలాండ్‌పైనా చూపింది. ఆదివారం జరిగిన పూల్‌ ‘ఎ’ లీగ్‌ మ్యాచ్‌లో 5–0తో పోలాండ్‌పై ఘనవిజయం సాధించింది. భారత్‌ తరఫున గుర్జీత్‌ కౌర్‌ (28వ, 35వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చేయగా... జ్యోతి (21వ నిమిషంలో), వందనా కటారియా (26వ నిమిషంలో), నవ్‌నీత్‌ కౌర్‌ (56వ నిమిషంలో) ఒక్కో గోల్‌ సాధించారు.ఇతర లీగ్‌ మ్యాచ్‌ల్లో రష్యా 6–0తో మెక్సికోపై, చిలీ 3–1తో జపాన్‌పై, ఉరుగ్వే 4–0తో ఫిజీపై గెలుపొందాయి. భారత్‌ గ్రూప్‌లోని తన చివరి మ్యాచ్‌ను మంగళవారం ఫిజీతో ఆడనుంది.

Advertisement
 
Advertisement
Advertisement