గోవాను గెలిపించిన ఫెర్నాండెజ్ | Fernandes from Goa gelipincina | Sakshi
Sakshi News home page

గోవాను గెలిపించిన ఫెర్నాండెజ్

Nov 11 2016 11:23 PM | Updated on Oct 2 2018 8:39 PM

గోవాను గెలిపించిన ఫెర్నాండెజ్ - Sakshi

గోవాను గెలిపించిన ఫెర్నాండెజ్

సొంతగడ్డపై గోవా జట్టు సత్తా చాటుకుంది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో మూడో విజయాన్ని

ఫటోర్డా (గోవా): సొంతగడ్డపై గోవా జట్టు సత్తా చాటుకుంది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో మూడో విజయాన్ని నమోదు చేసింది. నార్త్ ఈస్ట్ యునెటైడ్ జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో గోవా జట్టు 2-1 గోల్స్ తేడాతో గెలిచింది. ప్రథమార్థం ముగిసేసరికి రెండు జట్లు ఖాతా తెరువడంలో విఫలమయ్యారుు. ఆట 50వ నిమిషంలో సితెసిన్ సింగ్ గోల్‌తో నార్త్ ఈస్ట్ జట్టు 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అరుుతే వారి ఆనందం ఎక్కువసేపు నిలువలేదు.

62వ నిమిషంలో రాబిన్ సింగ్ గోల్‌తో గోవా జట్టు స్కోరును 1-1తో సమం చేసింది. మ్యాచ్ ‘డ్రా’గా ముగియడం ఖాయమనుకుంటున్న తరుణంలో 90వ నిమిషంలో రోమియో ఫెర్నాండెజ్ గోల్ చేసి గోవా జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. 10 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న గోవా పది పారుుంట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement