మా ఆట అసాధారణం: మోర్గాన్‌ | Eoin Morgan says the team were outstanding in third ODI against India | Sakshi
Sakshi News home page

మా ఆట అసాధారణం: మోర్గాన్‌

Jul 19 2018 11:24 AM | Updated on Jul 19 2018 11:24 AM

Eoin Morgan says the team were outstanding in third ODI against India - Sakshi

లీడ్స్‌: టీమిండియాతో వన్డే సిరీస్‌ను గెలవడంపై ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ సంతోషం వ్యక్తం చేశాడు.  మూడో వన్డేలో తమ ఆట తీరు అసాధారణంగా ఉండటంతోనే టీమిండియాపై సిరీస్‌ను కైవసం చేసుకోగలిగామన్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో చేసిన పొరపాట్లను త్వరగా సరిదిద్దుకొని సిరీస్‌ సాధించామన్నాడు.

‘ముందు మా ఆరంభం పేలవం. సిరీస్‌ ముందుకు వెళ్తున్న కొద్దీ మెరుగయ్యాం. ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం వల్ల కలిగే ప్రయోజనం ఇదే.  ట్రెంట్‌బ్రిడ్జి నుంచి మా ప్రదర్శన నిలకడగా మెరుగైంది. చివరి మ్యాచ్‌లోనైతే ఇంకా అద్భుతం. మైదానంలో అడుడు పెట్టినప్పట్నుంచి చక్కగా ఆడాం. డేవిడ్‌ విలేతో కలిసి మార్క్‌వుడ్‌ నాలుగైదు ఓవర్లు మంచి స్వింగ్‌ రాబట్టాడు. అదే మా విజయానికి బాటలు వేసింది’ అని మోర్గాన్‌ అన్నాడు. టాస్‌ గెలవడం వల్లే మ్యాచ్‌లో విజయం సాధించామనే వాదనను మోర్గాన్‌ తోసిపుచ్చాడు. తాను తీసుకున్న నిర్ణయానికి తగ్గట్టు  తమ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శనను కనబరచడం వల్లే విజయం సాధ్యమైందనే విషయం తెలుసుకోవాలన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement