యాషెస్ తొలి టెస్టు ఇంగ్లండ్‌దే... | England won first test match | Sakshi
Sakshi News home page

యాషెస్ తొలి టెస్టు ఇంగ్లండ్‌దే...

Jul 12 2015 1:08 AM | Updated on Sep 3 2017 5:19 AM

యాషెస్ తొలి టెస్టు ఇంగ్లండ్‌దే...

యాషెస్ తొలి టెస్టు ఇంగ్లండ్‌దే...

గత యాషెస్‌లో 0-5తో దారుణంగా ఓడిన ఇంగ్లండ్ ఈసారి మాత్రం తొలి టెస్టులోనే జూలు విదిల్చింది.

 169 పరుగులతో ఆసీస్ చిత్తు
 కార్డిఫ్: గత యాషెస్‌లో 0-5తో దారుణంగా ఓడిన ఇంగ్లండ్ ఈసారి మాత్రం తొలి టెస్టులోనే జూలు విదిల్చింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌ను మరో రోజు మిగిలి ఉండగానే 169 పరుగుల తేడాతో గెలిచింది. 412 పరుగుల విజయలక్ష్యంతో నాలుగో రోజు శనివారం బరిలోకి దిగిన ఆసీస్‌ను ఇంగ్లండ్ బౌలర్లు కుదురుకోనీయలేదు. ఫలితంగా 70.3 ఓవర్లలో 242 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
 
 ప్రారంభంలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (86 బంతుల్లో 52; 6 ఫోర్లు; 1 సిక్స్) కాస్త పోరాడినా పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (3/39), మొయిన్ అలీ (3/59) ధాటికి మిడిల్ ఆర్డర్ తోక ముడిచింది. అయితే చివర్లో మిచెల్ జాన్సన్ (94 బంతుల్లో 77; 9 ఫోర్లు; 2 సిక్సర్లు) అసమాన పోరాటాన్ని ప్రదర్శించినా లాభం లేకపోయింది. మార్క్ వుడ్, జో రూట్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. రూట్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.
 

Advertisement
 
Advertisement
Advertisement