అఫ్ఘాన్ బౌలర్ల దెబ్బకు ఇంగ్లండ్ విలవిల | england 42/4 in 6 overs | Sakshi
Sakshi News home page

అఫ్ఘాన్ బౌలర్ల దెబ్బకు ఇంగ్లండ్ విలవిల

Mar 23 2016 3:49 PM | Updated on Sep 3 2017 8:24 PM

అఫ్ఘాన్ బౌలర్ల దెబ్బకు ఇంగ్లండ్ విలవిల

అఫ్ఘాన్ బౌలర్ల దెబ్బకు ఇంగ్లండ్ విలవిల

టి-20 ప్రపంచ కప్లో దూకుడుమీదున్న ఇంగ్లండ్కు అఫ్ఘానిస్తాన్ బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు.

న్యూఢిల్లీ: టి-20 ప్రపంచ కప్లో దూకుడుమీదున్న ఇంగ్లండ్కు అఫ్ఘానిస్తాన్ బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. బుధవారం ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లీష్ మెన్ ఆరంభంలోనే తడబడ్డారు. అఫ్ఘాన్ బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ టాపార్డర్ విలవిలలాడింది. ఇంగ్లండ్ 14 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది.  అఫ్ఘాన్ బౌలర్లు మహ్మద్ నబీ రెండు, ఆమిర్ హంజా, రషీద్ ఖాన్, షెన్వారి తలా వికెట్ తీశారు.

ఇంగ్లండ్ ఆరంభంలోనే కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో అఫ్ఘాన్ బౌలర్ ఆమిర్ హంజా.. ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్ (5)ను బౌల్డ్ చేసి వికెట్ల వేటకు శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత నబీ.. వరుస బంతుల్లో జేమ్స్ విన్సె (22), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (0)ను పెవిలియన్ చేర్చాడు. ఇదే ఓవర్లో జో రూట్ (12) రనౌటయ్యాడు. స్టోక్స్ (7), బట్లర్ (6) కూడా ఎంతో సేపు క్రీజులో నిలవలేకపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement