‘మదర్‌’ మిమిక్రీకి ఫిదా అయిన బుమ్రా..!

Elder Lady Imitates Jasprit Bumrah Bowling Action - Sakshi

న్యూఢిలీ​ : టీమిండియా యార్కర్‌కింగ్‌, స్పీడ్‌గన్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఆటకే కాదు.. విభిన్నమైన అతని బౌలింగ్‌ శైలికి కోట్లాది మంది అభిమానులున్నారు. అద్భుతమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బౌలింగ్‌ చేస్తూ బుమ్రా భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. తక్కువ లెంగ్త్‌ తీసుకుని వేగంగా బంతులు విసిరే బుమ్రా బౌలింగ్‌ను ఓ క్రికెట్‌ వీరాభిమాని తల్లి అనుకరించారు. ఆమె మిమిక్రీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ‘యువత మాదిరిగానే.. పెద్దవాళ్లు కూడా ప్రపంచకప్‌లో బుమ్రా బౌలింగ్‌కు ఫిదా అయ్యారు. అందుకే మా అమ్మ అతని బౌలింగ్‌ శైలిని అనుకరించారు’అని ఓ అభిమాని ట్విటర్‌లో ఓ వీడియో పోస్టు చేశాడు. ఇది వైరల్‌ అయింది. పెద్దావిడ బౌలింగ్‌ అనుకరణకు బుమ్రా ఫిదా అయ్యాడు. ‘మీ ఉత్సాహం నాకు మరింత ఉత్సాహాన్నింది’అని రిప్లై ఇచ్చాడు.

ఇక అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన మూడేళ్లకాలంలోనే బుమ్రా టాప్‌ బౌలర్‌గా మారాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో నెంబర్‌ 1 పొజిషన్‌లో కొనసాగుతున్నాడు. ఇక తాజా ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌లాడి 18 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. జట్టు విజయాల్లో ‘రోహిత్‌కు సమానంగా బుమ్రా’ కీలక పాత్ర పోషించాడని మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ పేర్కొనడం గమనార్హం. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 18 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

14-07-2019
Jul 14, 2019, 17:20 IST
లండన్‌ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. అర్దసెంచరీ సాధించి మంచి ఊపుమీదున్న నికోలస్‌(55)ను ప్లంకెట్‌ బౌల్డ్‌...
14-07-2019
Jul 14, 2019, 16:57 IST
లండన్‌: న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ సరికొత్త వరల్డ్‌ రికార్డు సాధించాడు. ఒక వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు...
14-07-2019
Jul 14, 2019, 16:37 IST
న్యూఢిల్లీ:  టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని తన రిటైర్మెంట్‌కు సంబంధించి ఏమైనా ఆలోచన ఉంటే దాన్ని మానుకోవాలని ఇప్పటికే...
14-07-2019
Jul 14, 2019, 15:33 IST
న్యూఢిల్లీ: వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా తన ప్రస్థానాన్ని సెమీస్‌లోనే ముగించడంపై మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ పెదవి విప్పాడు. భారత...
14-07-2019
Jul 14, 2019, 14:33 IST
న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌ జరిగిన వరల్డ్‌కప్‌ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా అద్భుత పోరాటంతో టీమిండియాను విజయం అంచున నిలబెట్టాడు. ...
14-07-2019
Jul 14, 2019, 05:30 IST
ప్రారంభంలో చప్పగా సాగుతోందన్నారు వారాలు గడుస్తున్నా ఊపు లేదన్నారు మ్యాచ్‌లు తరుగుతున్నా మజా ఏదన్నారు మధ్యలోకి వచ్చేసరికి కాక మొదలైంది...
13-07-2019
Jul 13, 2019, 19:57 IST
లండన్‌: సెమీస్‌లో ఆస్ట్రేలియాను మట్టికరిపించి ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌ సగర్వంగా అడుగుపెట్టింది. క్రికెట్‌ విశ్వసమరంలో నాలుగోసారి ఫైనల్‌కు చేరిన ఇంగ్లండ్‌...
13-07-2019
Jul 13, 2019, 19:23 IST
బర్మింగ్‌హామ్‌: వన్డే వరల్డ్‌కప్‌లో ఆసీస్‌ జట్టు ఒకే ఒక్క చెత్త ప్రదర్శనతోనే మెగా టోర్నీ నుంచి నిష్క్రమణకు కారణమైందని ఆ...
13-07-2019
Jul 13, 2019, 18:47 IST
లండన్‌: మీడియా హడావుడి లేదు. అభిమానుల తాకిడి లేదు. ఒంటరిగా.. ప్రశాంతంగా, ఎవరినీ ఇబ్బందులకు గురిచేయకుండా సాధారణ రైలు ప్రయాణం చేశాడు...
13-07-2019
Jul 13, 2019, 18:30 IST
న్యూఢిల్లీ: వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా సెమీస్‌ నుంచి నిష్క్రమించడంతో అది విరాట్‌ కోహ్లి కెప్టెన్సీపై ప్రభావం చూపే అవకాశాలు కనబడుతున్నాయి....
13-07-2019
Jul 13, 2019, 17:31 IST
లండన్‌: స్వదేశంలో వన్డే వరల్డ్‌కప్‌ను సాధించి తమ చిరకాల కోరిక తీర్చుకోవాలని ఆశ పడుతోంది ఇంగ్లండ్‌. 27 ఏళ్ల తర్వాత...
13-07-2019
Jul 13, 2019, 17:27 IST
హైదరాబాద్ ‌: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి, మాజీ లెజెండ్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌లు దక్షిణాఫ్రికా మాజీ విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్‌కు...
13-07-2019
Jul 13, 2019, 16:38 IST
సిడ్నీ:  వన్డే వరల్డ్‌కప్‌లో అసలు సిసలు సమరానికి వచ్చేసరికి ఆసీస్‌ తేలిపోవడంపై ఆ దేశ దిగ్గజ ఆటగాడు అలెన్‌ బోర్డర్‌...
13-07-2019
Jul 13, 2019, 15:38 IST
మాంచెస్టర్‌: వన్డే వరల్డ్‌కప్‌లో ఎన్నో ఆశలతో బరిలోకి దిగి సెమీస్‌లోనే తమ ప్రస్థానాన్ని ముగించి స్వదేశానికి తిరిగి పయనమయ్యేందుకు సిద్ధమైంది....
13-07-2019
Jul 13, 2019, 14:58 IST
న్యూజిలాండ్‌ కెప్టెన్‌  కేన్‌ విలియమ్సన్‌ వన్డే ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించడానికి ఒక్క పరుగు దూరంలో నిలిచాడు.
13-07-2019
Jul 13, 2019, 14:43 IST
కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికా వరల్డ్‌కప్‌ జట్టులో తాను పునరాగమనం కోసం ప్రయత్నం చేశాననే వార్తలను ఆ దేశ మాజీ క్రికెటర్‌ ఏబీ...
13-07-2019
Jul 13, 2019, 12:05 IST
ఈ నేపథ్యంలో ధోని బీజేపీలో చేరితే ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా బరిలోకి దింపుతారనే..
13-07-2019
Jul 13, 2019, 11:07 IST
మీరు ఫైనల్‌ మ్యాచ్‌కు రాకపోతే దయచేసి ఆ టికెట్లను అధికారిక ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా తిరిగి అమ్మండి.
13-07-2019
Jul 13, 2019, 04:37 IST
లండన్‌: విఖ్యాత లార్డ్స్‌ మైదానంలో ఆదివారం జరుగనున్న ప్రపంచ కప్‌ ఫైనల్‌కు కుమార ధర్మసేన (శ్రీలంక), మారిస్‌ ఎరాస్మస్‌ (దక్షిణాఫ్రికా)...
13-07-2019
Jul 13, 2019, 04:20 IST
ముంబై: ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రదర్శనను సమీక్షించాలని క్రికెట్‌ పరిపాలకుల కమిటీ (సీఓఏ) నిర్ణయించింది. దీనికి సంబంధించి త్వరలోనే జట్టు...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top