'ఆ దిగ్గజ బౌలర్తో పోల్చకండి' | Don't Call Me Warney, Says Australia Prospect Zampa | Sakshi
Sakshi News home page

'ఆ దిగ్గజ బౌలర్తో పోల్చకండి'

May 30 2016 5:26 PM | Updated on Sep 4 2017 1:16 AM

'ఆ దిగ్గజ బౌలర్తో పోల్చకండి'

'ఆ దిగ్గజ బౌలర్తో పోల్చకండి'

ప్రపంచ క్రికెట్లో ఎంతో సుదీర్ఘ దూరం ప్రయాణించి, అనేక అద్భుతాలు సృష్టించిన దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్తో తనను పోల్చవద్దని యువ ఆస్ట్రేలియా క్రికెటర్ ఆడమ్ జంపా స్పష్టం చేశాడు.

మెల్బోర్న్: ప్రపంచ క్రికెట్లో ఎంతో సుదీర్ఘ దూరం ప్రయాణించి, అనేక అద్భుతాలు సృష్టించిన దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్తో తనను పోల్చవద్దని యువ ఆస్ట్రేలియా క్రికెటర్ ఆడమ్ జంపా స్పష్టం చేశాడు. ఇటీవల ఆస్ట్రేలియా జట్టులో స్థానం దక్కించుకున్న జంపా యాక్షన్ వార్న్ శైలిని పోలి ఉండటంతో అంతా అతన్ని 'వార్నీ' అని పిలుస్తున్నారు.  దీనిపై తాజాగా స్పందించిన జంపా.. అంత పెద్ద స్పిన్నర్తో తనను పోల్చడం ఎంతమాత్రం సరికాదన్నాడు. 'ఎప్పుడూ షేన్ వార్న్ అనేవాడు ఒక్కడే ఉంటాడు. అతనితో ఏ ఒక్క స్పిన్నర్ను పోల్చలేం. అందుకు అతని సాధించిన ఘనతలే సాక్షం. వార్న్ మొత్తం కెరీర్ ఒక అద్భుతం'అని జంపా కొనియాడాడు.

ఐపీఎల్-9 సీజన్లో పుణె సూపర్ జెయింట్స్ తరుపున ఆడిన జంపా.. ఈ ఏడాది ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్ లో మెల్బోర్న్ స్టార్స్కు ప్రాతినిథ్యం వహించాడు. బిగ్ బాష్ లీగ్ లో జంపా రాణించడంతో ఫిబ్రవరిలో జరిగిన న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ద్వారా  అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగేట్రం చేశాడు. వచ్చే నెల్లో వెస్టిండీస్ లో జరిగే ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా జట్టులో స్థానం  దక్కించుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement