దివ్యా రెడ్డికి రెండు పతకాలు  | Divya Reddy Wins Two Medals In Asian Masters Athletics | Sakshi
Sakshi News home page

ఆసియా మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ టోర్నీ: దివ్యా రెడ్డికి రెండు పతకాలు 

Dec 4 2019 12:36 AM | Updated on Dec 4 2019 12:53 PM

Divya Reddy Wins Two Medals In Asian Masters Athletics - Sakshi

ఆసియా మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ మహిళా అథ్లెట్‌ దివ్యా రెడ్డి రెండు పతకాలు సాధించింది. మలేసియాలోని సారావక్‌లో జరుగుతున్న ఈ చాంపియన్‌షిప్‌లో దివ్యా రెడ్డి 40 ఏళ్ల వయో విభాగంలో 800 మీటర్ల కేటగిరీలో విజేతగా నిలిచి స్వర్ణం సొంతం చేసుకోగా... 400 మీటర్ల విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. 800 మీటర్ల ఫైనల్లో దివ్యా రెడ్డి అందరికంటే ముందుగా 2 నిమిషాల 53.64 సెకన్లలో గమ్యానికి చేరి చాంపియన్‌గా అవతరించింది. గో తెంగ్‌ యిన్‌ (మలేసియా– 2ని:54.15 సెకన్లు) రజతం... అమితా కనెగాంకర్‌ (భారత్‌–2ని:54.73 సెకన్లు) కాంస్యం సాధించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement