ధోని సరదాగా..! | Dhoni signals for a review jokingly | Sakshi
Sakshi News home page

ధోని సరదాగా..!

Apr 6 2017 10:49 PM | Updated on Sep 5 2017 8:07 AM

ధోని సరదాగా..!

ధోని సరదాగా..!

ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్ తో మూడో వన్డేల సిరీస్ లో భాగంగా పుణెలో జరిగిన తొలి వన్డేలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తొందర్లో రివ్యూకు వెళ్ళిన సంగతి తెలిసిందే.

పుణె: ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్ తో  మూడో వన్డేల సిరీస్ లో భాగంగా పుణెలో జరిగిన తొలి వన్డేలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తొందర్లో రివ్యూకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆటగాడిగా ఉన్న ధోని పొరపాటున డీఆర్ఎస్ సంకేతాలిచ్చాడు. అంపైర్ నిర్ణయంపై సమీక్ష కోసం కెప్టెన్ అప్పీల్ చేయవలసిన సమయంలో ధోని రివ్యూకు వెళ్లాడు. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న  తర్వాత ఆడిన తొలి మ్యాచ్ కాబట్టి ధోని అలా తొందర్లో రివ్యూకు వెళ్లాడు.

అయితే ఇదే స్టేడియంలో ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో ధోని సరదాగా రివ్యూ కోసం వెళ్లాడు. ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో భాగంగా  తమ జట్టు లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ వేసిన బౌలింగ్ లో ధోని రివ్యూ కోరాడు. పొలార్డ్ అవుట్ విషయంలో ధోని రివ్యూ అంటూ సైగ చేశాడు. ఇక్కడ  రివ్యూలు లేకపోయినా థర్డ్ అంపైర్ అంటూ సంకేతాలిచ్చాడు ధోని. తాహీర్ అప్పీల్ కు అంపైర్ స్పందిచకపోవడంతో ధోని ఇలా చేసి నవ్వులు పూయించాడు.  కాగా, టీవీ రిప్లేలో అది అవుట్ గా కనబడినప్పటికీ ఐపీఎల్లో డీఆర్ఎస్ లేకపోవడంతో పొలార్డ్ బతికిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement