ఒమన్‌తో నేడు భారత్ పోరు | Depleted India take on Oman in football World Cup qualifiers | Sakshi
Sakshi News home page

ఒమన్‌తో నేడు భారత్ పోరు

Oct 13 2015 12:59 AM | Updated on Sep 3 2017 10:51 AM

ఒమన్‌తో నేడు భారత్ పోరు

ఒమన్‌తో నేడు భారత్ పోరు

ప్రపంచకప్ ఫుట్‌బాల్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో భాగంగా భారత జట్టు నేడు (మంగళవారం) పటిష్ట ఒమన్ జట్టును ఢీకొననుంది.

మస్కట్: ప్రపంచకప్ ఫుట్‌బాల్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో భాగంగా భారత జట్టు నేడు (మంగళవారం) పటిష్ట ఒమన్ జట్టును ఢీకొననుంది. ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లు ఆడిన భారత్ అన్నింటా పరాజయం పాలై తీవ్ర ఒత్తిడిలో ఉంది. గ్వామ్ లాంటి చిన్న జట్టుపై కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఐదు జట్లు ఉన్న తమ గ్రూపులో ప్రత్యర్థి జట్లపై మూడు గోల్స్ మాత్రమే చేయగలిగింది. ఈనేపథ్యంలో ఫిఫా ర్యాంకింగ్స్‌లో 102వ స్థానంలో ఉన్న ఒమన్‌ను 167వ ర్యాంకులో ఉన్న భారత్ ఏమేరకు ప్రతిఘటించగలదనేది ఆసక్తికరం. దీనికి తోడు తమ చివరి మ్యాచ్‌లో భారత జట్టు తుర్క్‌మినిస్తాన్ చేతిలో 1-2తో ఓడటంతో పాటు విమానం ఆలస్యం కావడంతో ప్రాక్టీస్‌కు కూడా సరైన సమయం చిక్కలేదు. అటు ఈనెల 8న ఇరాన్‌తో జరిగిన  మ్యాచ్‌ను ఒమన్ 1-1తో డ్రా చేసుకుని జోరు మీదుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement