breaking news
World Football
-
రియల్ మాడ్రిడ్ క్లబ్ మాజీ అధ్యక్షుడు లొరెంజో మృతి
మాడ్రిడ్ (స్పెయిన్): ప్రపంచ ఫుట్‌బాల్‌లో విఖ్యాత క్లబ్‌గా పేరొందిన రియల్ మాడ్రిడ్ క్లబ్‌కు ఐదేళ్లపాటు అధ్యక్షుడిగా వ్యవహరించిన లొరెంజో సాంజ్ మృతి చెందారు. కొన్నిరోజుల క్రితం కరోనా వైరస్ బారిన పడిన ఆయన ఆస్పత్రిలో చిక్సిత తీసుకుంటూ ఆదివారం కన్నుమూశారని లొరెంజో కుమారుడు లొరెంజో సాంజ్ జూనియర్ తెలిపాడు. 76 ఏళ్ల లొరెంజో 1995 నుంచి 2000 వరకు రియల్ మాడ్రిడ్ క్లబ్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన హయాంలో రియల్ మాడ్రిడ్ జట్టు 1998, 2000లో ప్రతిష్టాత్మక చాంపియన్స్ లీగ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 118 ఏళ్ల చరిత్ర ఉన్న రియల్ మాడ్రిడ్ క్లబ్ స్పెయిన్ దేశవాళీ ఫుట్‌బాల్ టోర్నీ లా లీగాలో 33 సార్లు... యూరోప్ దేశాల్లోని క్లబ్ జట్ల మధ్య జరిగే చాంపియన్స్ లీగ్ టోర్నీలో 13 సార్లు విజేతగా నిలిచింది. కోవిడ్–19 ప్రస్తుతం యూరోప్‌లో విజృంభిస్తోంది. ఒక్క స్పెయిన్‌లోనే ఇప్పటివరకు 1,320 మంది కరోనాతో మృతి చెందారు. -
ఒమన్‌తో నేడు భారత్ పోరు
మస్కట్: ప్రపంచకప్ ఫుట్‌బాల్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో భాగంగా భారత జట్టు నేడు (మంగళవారం) పటిష్ట ఒమన్ జట్టును ఢీకొననుంది. ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లు ఆడిన భారత్ అన్నింటా పరాజయం పాలై తీవ్ర ఒత్తిడిలో ఉంది. గ్వామ్ లాంటి చిన్న జట్టుపై కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఐదు జట్లు ఉన్న తమ గ్రూపులో ప్రత్యర్థి జట్లపై మూడు గోల్స్ మాత్రమే చేయగలిగింది. ఈనేపథ్యంలో ఫిఫా ర్యాంకింగ్స్‌లో 102వ స్థానంలో ఉన్న ఒమన్‌ను 167వ ర్యాంకులో ఉన్న భారత్ ఏమేరకు ప్రతిఘటించగలదనేది ఆసక్తికరం. దీనికి తోడు తమ చివరి మ్యాచ్‌లో భారత జట్టు తుర్క్మినిస్తాన్ చేతిలో 1-2తో ఓడటంతో పాటు విమానం ఆలస్యం కావడంతో ప్రాక్టీస్‌కు కూడా సరైన సమయం చిక్కలేదు. అటు ఈనెల 8న ఇరాన్‌తో జరిగిన మ్యాచ్‌ను ఒమన్ 1-1తో డ్రా చేసుకుని జోరు మీదుంది. -
‘గోల్’ తప్పని వేటగాడు
అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) 1904లో ఏర్పాటైంది. 1998 వరకు ఇది ఓ సాధారణ క్రీడా సంస్థ. 10 మంది సిబ్బందితో ఓ చిన్న ఆఫీసులో కార్యకలాపాలు నిర్వహించేవారు. టోర్నీలు నిర్వహించాలంటే అప్పు కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. కట్ చేస్తే 17 ఏళ్ల తర్వాత.... ప్రస్తుతం 1400 మంది ఉద్యోగులు... కళ్లుచెదిరే భవంతి... కోట్లాది రూపాయలను కళ్లుమూసుకుని ఇచ్చేంత ధనిక సంస్థ. ఈ మార్పు వెనక ఉన్న ప్రధాన శక్తి బ్లాటర్. ఫిఫాను అత్యంత శక్తివంతమైన క్రీడా సంస్థగా ఆయన తీర్చి దిద్దారు. అందుకే ఎన్ని ఆరోపణలు వచ్చినా ఆయన వరుసగా ఐదోసారి ఫిఫా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సాక్షి క్రీడావిభాగం : జోసెఫ్ సెప్ బ్లాటర్... ప్రస్తుతం ప్రపంచ ఫుట్‌బాల్‌ను బలీయమైన శక్తిగా తీర్చిదిద్దిన 79 ఏళ్ల స్విస్ కురు వృద్ధుడు. 111 ఏళ్ల చరిత్ర ఉన్న ఫిఫాలో బ్లాటర్‌కు ముందు ఏడుగురు అధ్యక్షులుగా పని చేశారు. కానీ ఎవరూ ఆటను విశ్వవ్యాప్తం చేయలేకపోయారు. ఆఫ్రికా ఖండంలో ప్రపంచకప్ అనే కలను సాకారం చేసి చూపించిన వ్యక్తి బ్లాటర్. ఆయన ఎత్తులు, మార్కెటింగ్ వ్యూహాలు ఫుట్‌బాల్‌కు కాసుల పంట పండించాయి. చిన్న దేశాలను నిర్లక్ష్యం చేయకుండా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయనను ఐదోసారీ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టాయి. టెక్నికల్ డెరైక్టర్ నుంచి... 1975లో తొలిసారి ఫిఫాలో టెక్నికల్ డెరైక్టర్‌గా అడుగుపెట్టిన బ్లాటర్... ఊహించని రీతిలో ఎదిగారు. 1981లో ప్రధాన కార్యదర్శి పదవిని సాధించడంతో గవర్నింగ్ బాడీలో ఆయన హవా మొదలైంది. అధికారం కోసం అడ్డదారులు తొక్కుతున్నారనే ఆరోపణలు వచ్చినా... ఏమాత్రం లెక్క చేయకుండా 1998లో ఏకంగా అధ్యక్ష పదవికే పోటీ చేశారు. ఆఫ్రికా, ఆసియా, యూరోపియన్ దేశాల మద్దతు కూడగట్టి అదే ఏడాది జూన్‌లో 8న మొట్టమొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బ్రెజిల్‌కు చెందిన జావో హవలాంజ్ నుంచి బాధ్యతలు స్వీకరించే నాటికి ఫిఫా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఖజానాలో కనీసం ఓ మిలియన్ డాలర్లు కూడా లేని పరిస్థితి. దీనికి తోడు వివాదాలు. వీటన్నింటిని తన చాకచక్యంతో పరిష్కరించిన బ్లాటర్ చిన్న చిన్న లీగ్‌లకు, టోర్నీలకు కూడా ఆర్థిక ప్రయోజనాలు కలిగేలా ప్రణాళికలు రచించారు. ఫలితం యూరోపియన్ దేశాల్లో క్లబ్‌లకు కనక వర్షం కురిసింది. ఆటకు ఆదరణ పెరగడంతో లీగ్‌ల సంఖ్య కూడా పెరిగిపోయింది. ఇక్కడే వాణిజ్య మార్కెటింగ్‌కు అనువుగా ఆటను మల్చడంలో బ్లాటర్ కీలక పాత్ర పోషించారు. అంతే స్పాన్సర్లు క్యూ కట్టారు. చిన్న దేశాలు సైతం ఫిఫా సభ్యత్వం కోసం ఆటను మొదలుపెట్టే స్థాయికి చేరుకునేలా చేశాయి. దీన్ని గ్రహించిన బ్లాటర్... ఫుట్‌బాల్ ఆడే ప్రతి దేశానికి ఫిఫా నుంచి సమాన మొత్తంలో డబ్బు అందేలా చూశారు. స్పెయిన్‌కు ఓ రకంగా గినియాకు మరో రకంగా కాకుండా పారితోషికం, వాటాలు సమాన స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా చిన్న దేశాలన్నీ బ్లాటర్ గుప్పిట్లోకి వచ్చేశాయి. గత ఐదు పర్యాయాలు భారత్ బ్లాటర్‌కే ఓటు వేయడం దీనికో చక్కని ఉదాహరణ. అవినీతి ఆరోపణలు 2002లో రెండోసారి అధ్యక్షుడి కోసం పోటీ పడుతున్న తరుణంలో ఆర్థిక లావాదేవీల్లో తేడాలు, తెరవెనుక ఒప్పందాలు అంటూ బ్లాటర్పై రూమర్లు వచ్చాయి. ఓటు వేస్తే తమకు చెరో లక్ష డాలర్లు ఇస్తానని ఆశ చూపినట్లు ఆఫ్రికన్, సోమాలియా ఫుట్‌బాల్ సంఘాలు ఆరోపించాయి. అయినా కూడా మిగతా దేశాలు మాత్రం బ్లాటర్‌కే మద్దతివ్వడంతో మళ్లీ పగ్గాలు అందుకున్నారు. 2002 ప్రపంచకప్‌కు ముందు ఫిఫాలోనూ విభేదాలు తలెత్తాయి. బ్లాటర్ నిర్ణయాల వల్ల మార్కెటింగ్ పార్ట్నర్ ఐఎస్ఎల్కు 100 మిలియన్ డాలర్లు నష్టం వచ్చిందని సెక్రటరీ జనరల్ రూఫిన్ స్విస్ అధికారులకు రహస్య పత్రాలను అందజేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు బ్లాటర్ది తప్పేమీ లేదని తేల్చారు. 2007, 2011లో కూడా ఇంతకంటే ఎక్కువ ఆరోపణలు చుట్టు ముట్టినా ఫిఫాలో తన ఆధిపత్యాన్ని మాత్రం తగ్గనీయలేదు. ఈసారి ప్రత్యర్థులు మరింత చురుగ్గా వ్యవహరించినా... బ్లాటర్ ఆధిపత్యాన్ని అడ్డుకోలేకపోయారు. కుటుంబ నేపథ్యం... స్విట్జర్లాండ్‌లోని విస్ప్ అనే చిన్న గ్రామంలో 1936లో బ్లాటర్ జన్మించారు. బిజినెస్, ఎకానమీలో డిగ్రీ సాధించిన తర్వాత పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌గా, స్పోర్ట్స్ జర్నలిస్ట్‌గా, ఐస్ హాకీకి జనరల్ సెక్రటరీగా పని చేశారు. చిన్నప్పట్నించీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న బ్లాటర్... సంపాదన కోసం చాలా రకాల ఉద్యోగాలు చేశారు. ఇప్పటి వరకు మూడు పెళ్లిళ్లు చేసుకున్న బ్లాటర్‌కు ఓ కుమార్తె ఉంది. అప్పుడప్పుడు ఆడవాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడటం బ్లాటర్‌కు అలవాటు. ఫుట్‌బాల్‌కు మరింత ఆదరణ పెరగాలంటే మహిళలకు ఆటలో అవకాశం కల్పించాలని చెప్పే బ్లాటర్... ఆడవాళ్ల స్కర్ట్ సైజ్ ఎంత చిన్నగా ఉంటే ఆటకు ఆంత ప్రాచుర్యం వస్తుందని వ్యాఖ్యానిస్తుంటారు. ప్రస్తుతం 51 ఏళ్ల లిండాతో ఆయన సహజీవనం చేస్తున్నారు. -
సాకర్ మానియాకూ బోలెడు ఆప్‌లు...
భలే ఆప్స్ సాకర్ మానియా ఆరంభమైంది. బ్రెజిల్లో రొనాల్డో, మెస్సీల చమత్కారాలు, స్కోరు వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే బోలెడు అప్లికేషన్లు మీ కోసం అందుబాటులో ఉన్నాయి. స్కోర్లతోపాటు మ్యాచ్‌లు, క్రీడాకారులకు సంబంధించిన లోతైన విశ్లేషణలు అందించేందుకు ఈఎస్పీఎన్ ఒక అప్లికేషన్‌ను సిద్ధం చేసింది. మీకు ఇష్టమైన జట్టును ఎంచుకుని వాటి వివరాలను అలర్ట్‌ల రూపంలో పొందవచ్చు. ఇక ప్రపంచకప్ ఫుట్‌బాల్ పోటీని నిర్వహిస్తున్న ఫీఫా కూడా ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా వివరాలు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇవేకాకుండా ఫీఫా 14, వన్ఫుట్బాల్బ్రెజిల్, ట్రావెల్ పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఎడిషన్, ద స్కోర్ పేర్లతో కూడా అనేక ఆండ్రాయిడ్ అప్లికేషన్లు సాకర్ సంబరాన్ని మీ చేతుల్లోకి తెస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం... ఎంజాయ్ ‘ద బ్యూటిఫుల్ గేమ్’!