సాకర్ మానియాకూ బోలెడు ఆప్‌లు... | Soccer Mania apps assumed the worst .. | Sakshi
Sakshi News home page

సాకర్ మానియాకూ బోలెడు ఆప్‌లు...

Jun 11 2014 11:46 PM | Updated on Sep 2 2017 8:38 AM

సాకర్ మానియాకూ బోలెడు ఆప్‌లు...

సాకర్ మానియాకూ బోలెడు ఆప్‌లు...

సాకర్ మానియా ఆరంభమైంది. బ్రెజిల్‌లో రొనాల్డో, మెస్సీల చమత్కారాలు, స్కోరు వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారా?

భలే ఆప్స్

సాకర్ మానియా ఆరంభమైంది. బ్రెజిల్‌లో రొనాల్డో, మెస్సీల చమత్కారాలు, స్కోరు వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే బోలెడు అప్లికేషన్లు మీ కోసం అందుబాటులో ఉన్నాయి. స్కోర్లతోపాటు మ్యాచ్‌లు, క్రీడాకారులకు సంబంధించిన లోతైన విశ్లేషణలు అందించేందుకు ఈఎస్‌పీఎన్ ఒక అప్లికేషన్‌ను సిద్ధం చేసింది. మీకు ఇష్టమైన జట్టును ఎంచుకుని వాటి వివరాలను అలర్ట్‌ల రూపంలో పొందవచ్చు.

ఇక ప్రపంచకప్ ఫుట్‌బాల్ పోటీని నిర్వహిస్తున్న ఫీఫా కూడా ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా వివరాలు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇవేకాకుండా ఫీఫా 14, వన్‌ఫుట్‌బాల్‌బ్రెజిల్, ట్రావెల్ పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఎడిషన్, ద స్కోర్ పేర్లతో కూడా అనేక ఆండ్రాయిడ్ అప్లికేషన్లు సాకర్ సంబరాన్ని మీ చేతుల్లోకి తెస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం... ఎంజాయ్ ‘ద బ్యూటిఫుల్ గేమ్’!
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement