అమ్మకు ప్రేమతో ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ తలపై.. | Defender Jitendra Singh's hairdo reads 'Ma' - see pic | Sakshi
Sakshi News home page

అమ్మకు ప్రేమతో ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ తలపై..

Oct 6 2017 5:25 PM | Updated on Oct 2 2018 8:39 PM

Defender Jitendra Singh's hairdo reads 'Ma' - see pic - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మరి కొద్ది గంటల్లో ఫిఫా అండర్‌–17 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఫ్రారంభంకానుంది. తొలిసారి భారత్‌ ఈ టోర్నికి ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. అయితే మ్యాచ్‌కు ముందే ఓ భారత ఆటగాడు అందరి దృష్టిని ఆకర్షించాడు. బ్రేక్‌ది బియర్డ్‌,  స్పైక్స్‌ లాంటి వినూత్న హెయిర్‌ స్టైల్‌తో క్రికెటర్లు అలరిస్తుంటే.. ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ జితేంద్ర సింగ్‌ మాత్రం హెయిర్‌ స్టైల్‌తో తన తల్లిపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు.  హిందీలో ‘మా’( అమ్మ) అని కనిపించేలా జుత్తు కత్తరించుకొని అమ్మపై తనకున్న ప్రేమను తెలియజేశాడు.  ఈ ఫోటో ఇప్పుడూ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయింది.  ఆ తల్లి ఆశిస్సులతో తొలి మ్యాచ్‌లో జితేంద్ర అదరగొట్టాలని అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. రాత్రి 8 గంటలకు భారత్‌ అమెరికాతో జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో తొలి మ్యాచ్‌ ఆడనుంది.

Advertisement
 
Advertisement
Advertisement