డ్యాన్స్ ఇలా చేయాలి! | Dancing this should be done - yuvi | Sakshi
Sakshi News home page

డ్యాన్స్ ఇలా చేయాలి!

Jul 28 2015 1:33 PM | Updated on May 28 2018 2:02 PM

డ్యాన్స్ ఇలా చేయాలి! - Sakshi

డ్యాన్స్ ఇలా చేయాలి!

వారం రోజుల క్రితం శ్రీలంకపై పాకిస్తాన్ మూడో వన్డే గెలిచాక సానియాతో కలిసి షోయబ్ మాలిక్ చేసుకున్న సంబరాలు గుర్తున్నాయా. ఇ

షోయబ్ మాలిక్‌కు యువీ చురక
 

న్యూఢిల్లీ: వారం రోజుల క్రితం శ్రీలంకపై పాకిస్తాన్ మూడో వన్డే గెలిచాక సానియాతో కలిసి షోయబ్ మాలిక్ చేసుకున్న సంబరాలు గుర్తున్నాయా. ఇప్పుడే పార్టీ మొదలైందంటూ వీరిద్దరితో పాటు పాక్ క్రికెటర్లు చిందులేసి వీడియోను నెట్‌లో పెట్టారు. అయితే అందరి సంగతేమో కానీ మన స్టార్ యువరాజ్‌సింగ్‌కు మాత్రం ఈ డ్యాన్స్ అస్సలు నచ్చలేదు. దాంతో నేరుగా మాలిక్‌కే గురి పెడుతూ ‘ఇద్దరూ గొప్ప ఆటగాళ్లే. కానీ ఘోరమైన డ్యాన్సర్లు’ అని ట్వీట్ చేశాడు. అయితే షోయబ్ దీనిని లైట్ తీసుకోలేదు.

‘అయితే మైదానంలోకి వచ్చేయ్...’ అంటూ యువీకి సవాల్ విసిరాడు. దీనిని స్వీకరించిన యువరాజ్ ‘నేను ఎప్పుడూ మైదానంలోనే ఉన్నాను భాయ్’...అంటూ తాను డ్యాన్స్ చేసి మరీ వీడియో పెట్టాడు. అదీ ఏకంగా మైకేల్ జాక్సన్ ప్రఖ్యాత బిల్లీ జీన్ ఆల్బంనుంచి ‘మూన్‌వాక్’ డ్యాన్స్ మూమెంట్స్‌తో అదరగొట్టాడు. డ్యాన్స్ అంటే ఇలా చేయాలన్నట్లు చాలెంజ్ చేసినట్లుగా ఈ వీడియో ఉండటం విశేషం.
 

Advertisement
 
Advertisement
Advertisement