నూతన జీవనోత్తేజం

Cricketer Ambati Rayudu Blessed With Baby Girl - Sakshi

క్రీడాకారులందరికీ.. ముఖ్యంగా ఇండియన్‌ క్రికెటర్‌లలో దాదాపు అందరికీ కూతుళ్లే అని ఈమధ్యే మీరు ‘ఫ్యామిలీ’ లో స్టోరీ చూసి వుంటారు. ఇప్పుడు లేటెస్టుగా మరో క్రికెటర్‌కి అమ్మాయి పుట్టింది! బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడు,ఆయన భార్య చెన్నుపల్లి విద్య.. బ్లెస్డ్‌ విత్‌ బేబీ గర్ల్‌. ఈ సంతోషకరమైన వార్తను అందరికంటే ముందుగా ఐ.పి.ఎల్‌. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు.. లోకానికి వెల్లడించింది. తల్లీబిడ్డ, వారిద్దరికన్నా ఎక్కువగా చిరునవ్వులు చిందిస్తున్న తండ్రీ.. ఈ ముగ్గురూ ఉన్న ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ.. ‘ఇప్పుడిక డాడీస్‌ ఆర్మీ నుంచి ఆఫ్‌ లైన్‌ పాఠాలను ఉపయోగంలోకి పెట్టుకోవాలి. (ముద్దుల కూతుళ్లు)

విజిల్‌ పోడు’ అని సూపర్‌ కింగ్స్‌ కామెంట్‌ పెట్టింది. రాయుడుది గుంటూరు. రైట్‌ హ్యాండెడ్‌  మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మాన్‌. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు ఆటగాడు. క్రికెట్‌ రాజకీయాలకు విముఖుడు, విరక్తుడై గత ఏడాది ఇదే నెలలో రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఇప్పుడు ఇదే నెలలో తండ్రిగా నూతన జీవనోత్తేజంలోకి వచ్చేశాడు. జులై 12 న కూతురు పుట్టింది. మరో ఆడపిల్ల తండ్రి సురేష్‌ రైనా అతడికి శుభాభినందనలు తెలిపాడు. 34 ఏళ్ల రాయుడికి 2009లో పెళ్లయింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top