క్రియేటర్స్‌ తైక్వాండో క్లబ్‌కు 5 పతకాలు | Creators Taekwondo Club Got Five Medals | Sakshi
Sakshi News home page

క్రియేటర్స్‌ తైక్వాండో క్లబ్‌కు 5 పతకాలు

Jun 27 2019 1:54 PM | Updated on Jun 27 2019 1:54 PM

Creators Taekwondo Club Got Five Medals - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇండియా ఓపెన్‌ ఇంటర్నేషనల్‌ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో క్రియేటర్స్‌ తైక్వాండో క్లబ్‌ (సీటీసీ) క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో సీటీసీ ప్లేయర్లు ఐదు పతకాలను గెలుచుకున్నారు. ఇందులో మూడు స్వర్ణాలు, రెండు రజతాలు ఉన్నాయి. క్యాడెట్‌ బాలికల 55 కేజీల విభాగంలో గుల్జర్, జూనియర్‌ బాలికల 68 కేజీల కేటగిరీలో ఉదితి అగర్వాల్, బాలుర 78 కేజీల విభాగంలో అర్మాన్‌ గుల్జర్‌ పసిడి పతకాలతో మెరిశారు.

ఆర్‌. శివ కిరణ్‌ (క్యాడెట్‌ బాలుర 33 కేజీలు), మక్తదీర్‌ అహ్మద్‌ (క్యాడెట్‌ బాలుర 41 కేజీలు) చెరో రజతాన్ని సాధించారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో పతకాలు సాధించిన తమ క్రీడాకారులను బుధవారం సీటీసీ సత్కరించింది. ఈ కార్యక్రమంలో సీటీసీ అధ్యక్షుడు విద్యాసాగర్, కోచ్‌ టి. సురేందర్‌ సింగ్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement