కామన్వెల్త్ గేమ్స్: భారత్ రజత 'ప్రకాశం' | commonwealth games: Prakash Nanjappa wins silver | Sakshi
Sakshi News home page

కామన్వెల్త్ గేమ్స్: భారత్ రజత 'ప్రకాశం'

Jul 26 2014 5:14 PM | Updated on Sep 2 2017 10:55 AM

కామన్వెల్త్ గేమ్స్: భారత్ రజత 'ప్రకాశం'

కామన్వెల్త్ గేమ్స్: భారత్ రజత 'ప్రకాశం'

పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్ షూటర్ ప్రకాశ్ నంజప్ప రజత పతకం సాధించాడు.

గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్లో భారత్ షూటర్ల హవా కొనసాగుతోంది. షూటింగ్లో భారత్కు మరో పతకం దక్కింది. శనివారం జరిగిన పురుషుల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్ షూటర్ ప్రకాశ్ నంజప్ప రజత పతకం సాధించాడు.

ప్రకాశ్ 198.2 పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలిచి పతకం సొంతం చేసుకున్నాడు. ఈ ఈవెంట్లో డానియల్ రెపచొలి 199.5 పాయింట్లతో ప్రథమ స్థానం సాధించి పసిడి దక్కించుకున్నాడు. కాగా ఇదే విభాగంలో మరో భారత షూటర్ ఓం ప్రకాశ్ పాల్గొన్న ఫైనల్స్కు ముందే వెనుదిరిగాడు. శుక్రవారం జరిగిన పోటీల్లో భారత షూటర్లు అభినవ్ బింద్రా స్వర్ణం, మలైకా గోయెల్ రజతం సాధించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement