వైరల్‌ : కావాలనే ఔట్‌ అయ్యారు! | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 31 2018 4:12 PM

Comical dismissals in UAEs T20 Ajman All Stars League prompt ICC Investigation - Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌: దుబాయ్‌లో జరిగిన అజ్మన్‌ ఆల్‌ స్టార్స్‌ లీగ్‌పై సోషల్‌ మీడియా వేదికగా పెద్ద చర్చజరుగుతోంది. ఈ లీగ్‌లోని ఓ మ్యాచ్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే బ్యాట్స్‌మన్‌లు కావాలని అవుటవ్వడం, ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదు స్టంపౌట్‌లు, మూడు రనౌట్లు కావడం భిన్న వాదనలకు దారి తీసింది.  దీంతో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) రంగంలోకి దిగింది. ఈ మ్యాచ్‌పై పూర్తి దర్యాప్తు చేపట్టాలని ఐసీసీ యాంటీ కరప్షన్‌ టీమ్‌ను ఆదేశించింది. 

గత 23 నుంచి 25 మధ్య దుబాయ్‌లో అజ్మన్‌ ఓవల్‌ మైదానంలో ఈ టీ20 లీగ్‌ నిర్వహించారు. లీగ్‌లో భాగంగా దుబాయ్‌ స్టార్స్‌-షార్జా వారియర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన దుబాయ్‌ స్టార్స్‌ 136 పరుగులు చేసింది. 137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వారియర్స్‌ ఆటగాళ్లు వరుసగా వికెట్లు సమర్పించుకొని 46కే ఆలౌట్‌ అయ్యారు. మ్యాచ్‌ అనంతరం ఈ వీడియోపై సోషల్‌ మీడియాలో దుమారం రేగింది. వారియర్స్‌ ఆటగాళ్లు ఫిక్సింగ్‌ పాల్పడ్డారని నెటిజన్లు ఆరోపించారు. ఈ వీడియో చూస్తే అందరికి అలానే అనిపిస్తుంది. వారియర్స్‌ ఆటగాళ్లు ఏమాత్రం బాధ్యత లేకుండా వికెట్లు పారేసుకోవడం అనుమానం కలిగిస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement