నిర్ధారిత గంటన్నర సమయం కంటే మరో నాలుగు నిమిషాలు పెంచినా.. ఐవరీ కోస్ట్ మాత్రం విజయాన్ని అందుకోలేకపోయింది. కొలంబియా చేతుల్లో 2-1 గోల్స్ తేడాతో ఓడిపో్యింది.
నిర్ధారిత గంటన్నర సమయం కంటే మరో నాలుగు నిమిషాలు పెంచినా.. ఐవరీ కోస్ట్ మాత్రం విజయాన్ని అందుకోలేకపోయింది. కొలంబియా చేతుల్లో 2-1 గోల్స్ తేడాతో ఓడిపో్యింది. ఫిఫా వరల్డ్ కప్-2014లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ ఆసాంతం కొలంబియా తన ఆధిక్యాన్ని కనబరిచింది. ఫస్టాఫ్లో రెండు జట్లూ పోటాపోటీగా ఆడటంతో ఎవరూ ఒక్క గోల్ కూడా చేయలేకపోయినా.. రెండో హాఫ్లో మాత్రం కొలంబియా జట్టు దూకుడును పెంచింది. పదేపదే గోల్పోస్ట్ మీద దాడులు చేస్తూ రెండు గోల్స్ సాధించింది. ప్రత్యర్థి ఐవరీకోస్ట్ ఆటగాళ్లు పలుమార్లు మొరటుగా అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. వాటిని దాటుకుని మరీ రెండు గోల్స్ చేశారు. 64, 70వ నిమిషాల్లో కొలంబియాకు ఈ రెండు గోల్స్ వచ్చాయి.
అయితే ఐవరీ కోస్ట్ కూడా తమను ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదంటూ ప్రత్యర్థి గోల్పోస్ట్ మీద దాడులు పెంచింది. 73వ నిమిషంలో ఆ జట్టు ఆటగాడు గెర్వినో పలువురు కొలంబియా ఆటగాళ్లను దాటుకుంటూ, దాదాపుగా పడిపోయినంత పని అయినా కూడా.. ఒంటి కాలితో నేరుగా బంతిని నెట్లోకి పంపించాడు. దీంతో మరో పావుగంట మాత్రమే ఆట ఉందనగా ఆట వేడెక్కింది. 77వ నిమిషంలో దాదాపుగా గోల్ అయిపోయినట్లే కనిపించినా, చివర్లో తప్పిపోయింది. చివరకు కొలంబయాదే పై చేయి అయ్యింది.