సెమీస్‌లో ఓడిన నిధి జోడి | Circuit tennis tournament | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో ఓడిన నిధి జోడి

Mar 3 2017 12:49 AM | Updated on Sep 5 2017 5:01 AM

ఐటీఎఫ్‌ మహిళల సర్క్యూట్‌ టెన్నిస్‌ టోర్నీలో తెలుగమ్మాయిల పోరాటం ముగిసింది.

గ్వాలియర్‌: ఐటీఎఫ్‌ మహిళల సర్క్యూట్‌ టెన్నిస్‌ టోర్నీలో తెలుగమ్మాయిల పోరాటం ముగిసింది. డబుల్స్‌ సెమీఫైనల్లో నిధి చిలుముల–ప్రేరణ జంట 3–6, 5–7తో రియా–శ్వేతా రాణా జోడి చేతిలో ఓడింది. సింగిల్స్‌ క్వార్టర్స్‌లో భువన 7–5, 3–6, 4–6తో మహక్‌ జైన్‌ (భారత్‌) చేతిలో, సాయి సంహిత 6–4, 5–7, 2–6తో ఫత్మా అల్‌ నభాని (ఒమన్‌) చేతిలో కంగుతిన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement