'సెక్స్‌' వ్యాఖ్యలతో మళ్లీ గేల్ దుమారం! | Chris Gayle Crosses the Line Again With His Sexist Very Big Bat Comment | Sakshi
Sakshi News home page

'సెక్స్‌' వ్యాఖ్యలతో మళ్లీ గేల్ దుమారం!

May 21 2016 3:20 PM | Updated on Sep 4 2017 12:37 AM

'సెక్స్‌' వ్యాఖ్యలతో మళ్లీ గేల్ దుమారం!

'సెక్స్‌' వ్యాఖ్యలతో మళ్లీ గేల్ దుమారం!

వెస్టిండీస్‌ సూపర్‌ బ్యాట్స్‌మన్ క్రిస్‌ గేల్‌కు వివాదాలు కొత్త కాదు. గతంలో ప్రత్యక్ష ప్రసారంలో నాతో డేటింగ్‌కు వస్తావా.. కలిసి తాగుదామంటూ మహిళా స్పోర్ట్స్ యాంకర్‌తో అసభ్యంగా వ్యవహరించిన గేల్‌ తాజాగా సెక్సీస్ట్‌ వ్యాఖ్యలతో దుమారం రేపాడు.

లండన్‌: వెస్టిండీస్‌ సూపర్‌ బ్యాట్స్‌మన్ క్రిస్‌ గేల్‌కు వివాదాలు కొత్త కాదు. గతంలో ప్రత్యక్ష ప్రసారంలో నాతో డేటింగ్‌కు వస్తావా.. కలిసి తాగుదామంటూ మహిళా స్పోర్ట్స్ యాంకర్‌తో అసభ్యంగా వ్యవహరించిన గేల్‌ తాజాగా సెక్సీస్ట్‌ వ్యాఖ్యలతో దుమారం రేపాడు.

ప్రస్తుతం ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ జట్టు తరఫున ఆడుతున్న గేల్‌ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సెక్స్‌, మహిళలు, సమానత్వం గురించి వికృత వ్యాఖ్యలు చేశాడు. బ్రిటిష్ దినపత్రిక 'ద టైమ్స్‌' మహిళా జర్నలిస్టు చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  నువ్వు థ్రిసమ్‌కు (ముగ్గురు కలిసి శృంగారానికి) పాల్పడ్డవా? అని వెకిలిగా అడిగాడు. గేల్‌ ఇంటర్వ్యూ ఇటు క్రికెట్ ప్రపంచంలోనూ, అటు అంతర్జాతీయంగాను దుమారం రేపుతోంది.

మహిళలు సమానత్వం కన్నా ఎక్కువగానే ఎంజాయ్‌ చేస్తున్నారని, తమ దేశంలో సెక్స్‌ అనేది రిలాక్స్‌ కోసమనే భావముందని చెప్పాడు. మహిళలు తానంటే పడిచస్తారని, తాను చాలా అందంగా కనిపిస్తానని గేల్‌ చెప్పుకొచ్చాడు. 'మహిళలకు ఎక్కువ సమానత్వం ఉంది. వారు ఏం కావాలనుకుంటే అది చేయగలరు. జమైకా మహిళలు చాలా దృఢంగా ఉంటారు. తమకు ఎప్పుడు కావాలో వాళ్లే మీకు తెలుపుతారు' అని చెప్పాడు. మహిళలు తమ పురుషులను సంతోషపెట్టాలని, ఉద్యోగం చేస్తున్న మగువలైనా ఇంటికి ముందేవచ్చి భోజనం సిద్ధం చేయాలని అన్నాడు. ప్రియురాలు నటాషా బెరిడ్జ్‌తో పదేళ్లుగా డేటింగ్‌ చేస్తున్న గేల్‌కు చిన్నారి కూతురు ఉంది. తాను ఇంటికి వెళితే.. బిడ్డ న్యాపీని మారుస్తాను గానీ, ఇల్లు ఊడ్వడం, వంట చేయడం లాంటివి ఎప్పుడూ చేయబోనని పేర్కొన్నాడు.

మహిళా జర్నలిస్టుతో వికృత వ్యాఖ్యలు
జర్నలిస్టు చార్లెట్‌తో గేల్‌ వికృత వ్యాఖ్యలు చేశాడు. 'ఎంతమంది నల్లజాతి పురుషులతో గడిపావని గేల్ నన్ను అడిగాడు. ఆ ప్రశ్నను నేను పట్టించుకోకున్నా గుచ్చిగుచ్చి అడుగుతూ.. నువ్వెప్పుడైనా 'థ్రిసమ్‌కు పాల్పడ్డవా? నువ్‌ చేసి ఉంటావు' అంటు వెకిలి వ్యాఖ్యలు చేశాడు' అని చార్లెట్‌ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement