'చహల్‌ చాలా చిరాకు తెప్పిస్తున్నావు'

Chris Gayle Brutally Trolls Yuzvendra Chahal About Tik Tok Videos - Sakshi

ముంబై : టీమిండియా స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లాక్‌డౌన్‌తో ఆటలకు విరామం లభించడంతో క్రికెటర్లంతా సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తున్నారు. అయితే చాహల్‌ మాత్రం సహచరులపై ఏదో ఒక ఫన్నీపోస్ట్‌ చేసి సరదాగా వారిని ఆటపట్టిస్తుంటాడు.  ఈసారి మాత్రం విండీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ క్రిస్‌ గేల్‌ రివర్స్‌లో చాహల్‌నే సరదాగా ట్రోల్‌ చేశాడు.

'చహల్ నేను నీతో విసిగిపోతున్నా.. టిక్​టాక్ వీడియోలతో విసిగిస్తున్నావు. అందుకే నిన్ను బ్లాక్ చేస్తున్నా.. నిన్ను బ్లాక్ చేయాలని టిక్​టాక్​కు కూడా చెబుతా. ఇప్పటికిప్పుడు నువ్వు సోషల్ మీడియా నుంచి బయటకు వచ్చెయ్. ఇక జీవితంలో నిన్ను కలవద్దని, చూడకూడదని అనునుకుంటున్నా' అంటూ గేల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో చహల్‌తో మాట్లాడుతూ పేర్కొన్నాడు. కాగా ఇటీవల ఇన్​స్టాగ్రామ్​ లైవ్​లో మాట్లాడుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్​ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ కూడా చహల్ టిక్​టాక్ వీడియోల గురించి ట్రోల్‌ చేశారు. కాగా ఐపీఎల్ లో కోహ్లీ, చాహల్​తో కలిసి గేల్​ గతంలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఆడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్రిస్ గేల్​కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌లో ఉన్నాడు. 
(అనుష్క ‘లైటు’సాయానికి కోహ్లి ఇలా..)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top