చాంపియన్స్‌ హెచ్‌సీఏ ఎలెవన్‌ | Champions HCA Eleven | Sakshi
Sakshi News home page

చాంపియన్స్‌ హెచ్‌సీఏ ఎలెవన్‌

Sep 1 2017 12:38 AM | Updated on Sep 17 2017 6:12 PM

చాంపియన్స్‌ హెచ్‌సీఏ ఎలెవన్‌

చాంపియన్స్‌ హెచ్‌సీఏ ఎలెవన్‌

ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్‌ కప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో హెచ్‌సీఏ ఎలెవన్‌ జట్టు సత్తాచాటింది.

మొయినుద్దౌలా గోల్డ్‌కప్‌ కైవసం
∙ ఫైనల్లో 7 వికెట్లతో ఓడిన ఎయిరిండియా


హైదరాబాద్‌: ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్‌ కప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో హెచ్‌సీఏ ఎలెవన్‌ జట్టు సత్తాచాటింది. ఈ టోర్నీలో చాంపియన్‌గా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. గురువారం ఎయిరిండియాతో జరిగిన ఫైనల్లో హెచ్‌సీఏ ఎలెవన్‌ జట్టు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఎయిరిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 267 పరుగులు చేసింది. నమన్‌ ఓజా (62), మన్విందర్‌ బిస్లా (56) అర్ధసెంచరీలు చేశారు.

అనంతరం హెచ్‌సీఏ ఎలెవన్‌ 47.1 ఓవర్లలో 3 వికెట్లకు 273 పరుగులు చేసి గెలిచింది. తన్మయ్‌ అగర్వాల్‌ (84), బి. సందీప్‌ (71), కె. సుమంత్‌ (60 నాటౌట్‌) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. విజేతగా నిలిచిన హెచ్‌సీఏ ఎలెవన్‌ జట్టుకు రూ. 5లక్షలు, రన్నరప్‌గా నిలిచిన ఎయిరిండియాకు రూ. 3లక్షల ప్రైజ్‌మనీ లభించింది.  

Advertisement
 
Advertisement
Advertisement