బట్లర్ మెరుపు సెంచరీ | butler shocking century | Sakshi
Sakshi News home page

బట్లర్ మెరుపు సెంచరీ

Feb 4 2016 1:14 AM | Updated on Sep 3 2017 4:53 PM

బట్లర్ మెరుపు సెంచరీ

బట్లర్ మెరుపు సెంచరీ

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ గెల్చుకున్న ఇంగ్లండ్ వన్డేలనూ దూకుడుగా ఆరంభించింది. ప్రధాన బ్యాట్స్‌మెన్ చెలరేగడంతో ఇంగ్లండ్ పరుగుల వరద పారించింది.

ఇంగ్లండ్ 399/9   
దక్షిణాఫ్రికాతో తొలి వన్డే

 బ్లోమ్‌ఫాంటీన్: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ గెల్చుకున్న ఇంగ్లండ్ వన్డేలనూ దూకుడుగా ఆరంభించింది. ప్రధాన బ్యాట్స్‌మెన్ చెలరేగడంతో ఇంగ్లండ్ పరుగుల వరద పారించింది. ఇక్కడి మన్‌గాంగ్ ఓవల్ మైదానంలో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. జాస్ బట్లర్ (76 బంతుల్లో 105; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు సెంచరీ సాధించాడు. స్టోక్స్ (38 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), హేల్స్ (57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), రూట్ (52; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేయగా, రాయ్ (30 బంతుల్లో 48; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. వన్డేల్లో తమ రెండో అత్యధిక స్కోరు చేసిన ఇంగ్లండ్, తమ జట్టు తరఫున అత్యధిక సిక్సర్లు (15) నమోదు చేసింది. ఒక ఇన్నింగ్స్‌లో ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్ కనీసం ఒక సిక్సర్ అయినా కొట్టడం వన్డేల్లో ఇదే మొదటిసారి కావడం విశేషం.
 

Advertisement
 
Advertisement
Advertisement