ఐసీసీ అవార్డు రేసులో భువనేశ్వర్ | Bhuvneshwar nominated for ICC People's Choice Award | Sakshi
Sakshi News home page

ఐసీసీ అవార్డు రేసులో భువనేశ్వర్

Oct 8 2014 3:14 PM | Updated on Oct 17 2018 6:27 PM

ఐసీసీ అవార్డు రేసులో భువనేశ్వర్ - Sakshi

ఐసీసీ అవార్డు రేసులో భువనేశ్వర్

భారత యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ పేరును ఐసీసీ అవార్డుకు నామినేట్ చేశారు.

దుబాయ్: భారత యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ పేరును ఐసీసీ అవార్డుకు నామినేట్ చేశారు. పీపుల్స్ చాయిస్ అవార్డుకు భువితో పాటు మరో నలుగురు క్రికెటర్లను నామినేట్ చేశారు. అయితే వీరిలో ఒక్కరినే అవార్డుకు ఎంపిక చేస్తారు. క్రికెట్ అభిమానులు ఓటింగ్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. గెలిచిన వారికి వార్షిక ఐసీసీ అవార్డుల కార్యక్రమంలో అందజేస్తారు.

 www.lgiccawards.com ద్వారా తమ అభిమాన క్రికెటర్కు ఓటు వేయవచ్చు. అవార్డు రేసులో భవితో పాటు ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ చార్లెట్ ఎడ్వర్డ్స్, ఆస్ట్రేలియా ఫేసర్ మిచెల్ జాన్సన్, శ్రీలంక కెప్టెన్ మాథ్యూస్, దక్షిణాఫ్రికా స్పీడ్స్టర్ డేల్ స్టెయిన్ ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement