కేన్‌ ఔట్‌.. కెప్టెన్‌గా భువీ

Bhuvneshwar leads SRH as Williamson misses out due to injury - Sakshi

కోల్‌కతా: ఐపీఎల్‌-12వ సీజన్‌లో భాగంగా  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన కేకేఆర్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ ముందుగా సన్‌రైజర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌కు సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ దూరం కావడంతో అతని స్థానంలో భువనేశ్వర్‌కు  పగ్గాలు అప్పజెప్పారు. దాంతో ఐపీఎల్‌లో భువీ తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

భుజం గాయం కారణంగా విలియమ్సన్‌ మ్యాచ్‌కు దూరమయ్యాడు. విలియమ్సన్‌కు గాయం పెద్దది కాకపోయినప్పటికీ అనవసరపు రిస్క్‌ కు సన్‌రైజర్స్‌ చోటివ్వలేదు. ఇటీవల బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు ఆడుతున్న సమయంలో విలియమ్సన్‌ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే.

తుది జట్లు

కేకేఆర్‌: దినేశ్‌ కార్తీక్‌(కెప్టెన్‌), క్రిస్‌ లిన్‌, సునీల్‌ నరైన్‌, రాబిన్‌ ఊతప్ప, శుభ్‌మన్‌ గిల్‌, నితీష్‌ రాణా, అండ్రీ రస్సెల్‌, పియూష్‌ చావ్లా, కుల్దీప్‌ యాదవ్‌, ఫెర్గుసన్‌, ప్రసీద్‌ కృష్ణ

సన్‌రైజర్స్‌ : భువనేశ్వర్‌ కుమార్‌(కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌, బెయిర్‌ స్టో, మనీష్‌ పాండే, దీపక్‌ హుడా, షకీబుల్‌ హసన్‌, విజయ్‌ శంకర్‌, యుసుఫ్‌ పఠాన్‌, రషీద్‌ ఖాన్‌, సందీప్‌ శర్మ, సిద్దార్థ్‌ కౌల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top