బెంగాల్‌40   40 యూపీ   | Bengal Warriors' first draw | Sakshi
Sakshi News home page

బెంగాల్‌40   40 యూపీ  

Oct 21 2018 1:11 AM | Updated on Oct 21 2018 1:11 AM

Bengal Warriors' first draw - Sakshi

పుణే: ప్రొ కబడ్డీ లీగ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ జట్టు తొలి ‘డ్రా’ నమోదు చేసుకుంది. జోన్‌ ‘బి’లో భాగంగా శనివారం ఇక్కడ బెంగాల్‌ వారియర్స్, యూపీ యోధా మధ్య జరిగిన లీగ్‌ మ్యాచ్‌ 40–40తో డ్రాగా ముగిసింది. బెంగాల్‌ తరఫున మణిందర్‌ సింగ్‌ 16, జాంగ్‌ కున్‌ లీ 7 రైడ్‌ పాయింట్లు సాధించారు.

ట్యాక్లింగ్‌లో సుర్జీత్‌ సింగ్‌ (6 పాయింట్లు) రాణించాడు. యూపీ తరఫున ప్రశాంత్‌ 13, రిషాంక్‌ 9 రైడ్‌ పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో పుణేరీ పల్టన్‌ 33–32తో యు ముంబాపై గెలిచింది. నేటి మ్యాచ్‌ల్లో దబంగ్‌ ఢిల్లీతో బెంగాల్‌ వారియర్స్, పుణేరీ పల్టన్‌తో బెంగళూరు బుల్స్‌ తలపడతాయి.   

Advertisement
 
Advertisement
Advertisement