ప్రపంచకప్-2020‌: టీమిండియా జట్టు ఇదే | BCCI Announce U19 Cricket World Cup Squad | Sakshi
Sakshi News home page

ప్రపంచకప్‌- 2020: కెప్టెన్‌గా ప్రియంగార్గ్‌

Dec 2 2019 11:09 AM | Updated on Dec 2 2019 4:32 PM

BCCI Announce U19 Cricket World Cup Squad - Sakshi

ముంబై : దక్షిణాఫ్రికాలో జరుగనున్న అండర్‌- 19 ప్రపంచకప్‌ జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సోమవారం ప్రకటించింది. జనవరి 17 నుంచి ఆరంభం కానున్న ఈ మెగా ఈవెంట్‌లో ప్రియం గార్గ్‌ (ఉత్తరప్రదేశ్‌)నేతృత్వంలోని భారత జట్టు బరిలోకి దిగనుంది. ఈ మేరకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. గ్రూప్‌- ఏలో భారత్‌తో పాటుగా జపాన్‌, న్యూజిలాండ్‌, శ్రీలంక క్రికెట్‌ జట్లు ప్రత్యర్థి జట్లతో తలపడనున్నాయి. కాగా ఫిబ్రవరి 9న పోచెఫ్‌స్ట్రూంలో ప్రపంచకప్‌- 2020 ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఇక అండర్-19 విభాగంలో టీమిండియా ఇప్పటికే నాలుగుసార్లు ప్రపంచకప్‌ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. టీమిండియా ప్రస్తుత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని ఆనాటి అండర్‌-19 జట్టు భారత్‌కు ప్రపంచకప్‌ సాధించి పెట్టింది.

ప్రపంచకప్‌- 2020 అండర్‌-19 భారత జట్టు
ప్రియం గార్గ్‌(కెప్టెన్‌), ధ్రువ్‌ జరేల్‌(వైస్‌ కెప్టెన్‌/వికెట్‌ కీపర్‌), యశస్వి జైస్వాల్‌, దివ్యాంశ్‌ సక్సేనా, శశ్వత్‌ రావత్‌, దివ్యాంశ్‌ జోషి, శుభాంగ్‌ హెగ్డే, రవి బిష్ణోయి, ఆకాశ్‌ సింగ్‌, కార్తిక్‌ త్యాగి, అథర్వ అంకోలేకర్‌, కుమార్‌ కుషాగ్ర(వికెట్‌ కీపర్‌), సుశాంత్‌ మిశ్రా, విద్యాధర్‌ పాటిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement