
ముంబై: దీపావళినాడు భారత క్రికెట్ జట్టు గతంలో అనేక చిరస్మరణీయ విజయాలు సాధించిన విషయం అభిమానులకు గుర్తుండే ఉంటుంది. అయితే ఇకపై అలాంటి గెలుపు పటాస్‌లు వినిపించవు. దీపావళి పండగ సమయంలో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించవద్దంటూ ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ చేసిన విజ్ఞప్తి మేరకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ‘మా పరిశోధన ప్రకారం దీపావళి సమయంలో ప్రేక్షకులు క్రికెట్ చూడటానికి ఇష్టపడటం లేదని, దానికంటే ఇంట్లో గడపడమే మంచిదని భావిస్తున్నారు. ఆ సమయంలో టీవీ రేటింగ్‌లు కూడా రావడం లేదు. పైగా ఆటగాళ్లకు కూడా తగిన విరామం ఇచ్చేందుకు అదే సరైన సమయం. దీని ప్రకారమే ఇకపై మ్యాచ్‌లు షెడ్యూల్ చేసుకుంటే బాగుంటుంది’ అని స్టార్ తమ నివేదికలో పేర్కొంది.