మా గ్రూపులో పాకిస్తాన్ వద్దు | BCCI adjourns SGM till Saturday | Sakshi
Sakshi News home page

మా గ్రూపులో పాకిస్తాన్ వద్దు

Oct 1 2016 11:00 AM | Updated on Sep 4 2017 3:39 PM

మా గ్రూపులో పాకిస్తాన్ వద్దు

మా గ్రూపులో పాకిస్తాన్ వద్దు

జస్టిస్ ఆర్‌ఎం లోధా ప్యానెల్ ప్రతిపాదనల అమలుపై శుక్రవారం జరగాల్సిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక సర్వసభ్య సమావేశం

 ముంబై: జస్టిస్ ఆర్‌ఎం లోధా ప్యానెల్ ప్రతిపాదనల అమలుపై శుక్రవారం జరగాల్సిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం) ఒకరోజు పాటు వాయిదా పడింది. సమావేశానికి హాజరైన  రాష్ట్ర సంఘాల ప్రతినిధుల్లో కొందరి దగ్గర అధికారిక అనుమతి పత్రాలు లేవనే కారణంతో ఎస్‌జీఎంను శనివారానికి వాయిదా వేశారు. నిజానికి లోధా కమిటీ సంస్కరణలను తొలి దశలో అమలు చేయడానికి సుప్రీం కోర్టు బీసీసీఐకి ఇచ్చిన గడువు శుక్రవారంతోనే ముగిసింది.

పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లే కాదు.. అంతర్జాతీయ టోర్నమెంట్స్‌లోనూ కలిసి ఆడకూడదని బీసీసీఐ నిర్ణయించుకుంది. అందుకే భవిష్యత్‌లో అన్ని దేశాలు పాల్గొనే టోర్నీల్లో తమ రెండు జట్లను ఒకే గ్రూపులో ఉంచకుండా చూడాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని కోరింది. మరో ఏడు నెలల్లో ఇంగ్లండ్‌లో చాంపియన్‌‌స ట్రోఫీ జరగనున్న నేపథ్యంలో బీసీసీఐ ఇలా స్పందించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement