న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 66 పరుగులు చేసింది. దీంతో ప్రస్తుతం పర్యాటక జట్టు తొలి ఇన్నింగ్స్‌తో కలుపుకుని 122 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు న్యూజిలాండ్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 539 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
దీంతో బంగ్లాకు 56 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కివీస్ జట్టులో లాథమ్ (177; 18 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేశాడు. రహీమ్ స్థానంలో సబ్‌స్టిట్యూట్ వికెట్‌కీపర్‌గా వచ్చిన ఇమ్రుల్ కయేస్ ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు క్యాచ్‌లు తీసుకొని ప్రపంచ రికార్డును సృష్టించాడు.