రాణించిన భారత బౌలర్లు.. బంగ్లాతో తొలివన్డే | Bangladesh sets 273 runs target for India | Sakshi
Sakshi News home page

రాణించిన భారత బౌలర్లు.. బంగ్లాతో తొలివన్డే

Jun 15 2014 4:45 PM | Updated on Sep 2 2017 8:51 AM

రాణించిన భారత బౌలర్లు.. బంగ్లాతో తొలివన్డే

రాణించిన భారత బౌలర్లు.. బంగ్లాతో తొలివన్డే

టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్ను పూర్తి ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 272 పరుగులకు కట్టడి చేశారు.

మీర్పూర్: బంగ్లాదేశ్తో తొలివన్డేలో భారత బౌలర్లు రాణించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్ను పూర్తి ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 272 పరుగులకు కట్టడి చేశారు. బంగ్లాదేశ్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం ఆరంభమైన ఈ మ్యాచ్లో ఉమేష్ యాదవ్, అమిత్ మిశ్రా, పర్వేజ్ రసూల్ సత్తాచాటారు. ఉమేష్ మూడు, అమిత్, పర్వేజ్ రెండేసి వికెట్లు తీశారు.

భారత పేసర్ ఉమేష్ ఆరంభంలోనే తమీమ్ ఇక్బాల్ (0), మోమినల్ హక్ (6) అవుట్ చేసి జట్టుకు శుభారంభం అందించాడు. కాగా ఆ తర్వాత భారత బౌలర్లు కాస్త పట్టు సడలించారు. బంగ్లా బ్యాట్స్మెన్ అనామల్ హక్ (44), ముష్ఫికర్ రహీం (59), షకీబల్ హసన్ (52), మహ్మదుల్లా (41) జట్టును ఆదుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement