ఇంగ్లండ్‌పై చరిత్రను రిపీట్ చేస్తారా? | bangladesh repeat history against england | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌పై చరిత్రను రిపీట్ చేస్తారా?

Jun 1 2017 3:05 PM | Updated on Sep 5 2017 12:34 PM

ఇంగ్లండ్‌పై చరిత్రను రిపీట్ చేస్తారా?

ఇంగ్లండ్‌పై చరిత్రను రిపీట్ చేస్తారా?

చాంపియన్స్ ట్రోఫీ సందడి మొదలైంది. ప్రస్తుత చాంపియన్స్ ట్రోఫీలో అత్యంత బలంగా ఉన్న జట్టలో ఇంగ్లండ్ ఒకటి.

లండన్: ప్రస్తుత చాంపియన్స్ ట్రోఫీలో అత్యంత బలంగా ఉన్న జట్టలో ఇంగ్లండ్ ఒకటి. దాంతో పాటు ఈ టోర్నీ స్వదేశంలో జరుగుతుండటం కూడా వారికి అదనపు ప్రయోజనమనే చెప్పాలి. ఇదిలాఉంచితే, బంగ్లాదేశ్ తో జరుగుతున్న ఆరంభపు మ్యాచ్ లో ఇంగ్లండ్ ను ఒక సెంటిమెంట్ బలంగా వేధిస్తోంది.  అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్వహించే టోర్నమెంట్లలో ఇంగ్లండ్ పై బంగ్లాదేశ్ మెరుగైన రికార్డు ఉండటమే ఇందుకు కారణం. చివరిసారి ఇరుజట్ల మధ్య జరిగిన ఐసీసీ టోర్నమెంట్లలో ఇంగ్లండ్పై బంగ్లాదేశ్నే విజయం వరించింది. 2011, 2015 వరల్డ్కప్లలో ఇంగ్లండ్పై బంగ్లాదేశ్ విజయం సాధించి సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ గత చరిత్రను పునరావృతం చేస్తుందా?అనేది ఆసక్తికరంగా మారింది.

ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన  ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తొలుత బంగ్లాదేశ్ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. గ్రూప్-ఎలో జరుగుతున్న మ్యాచ్లో శుభారంభం చేయాలని ఇంగ్లండ్ భావిస్తుండగా, సంచలనాలకు మారుపేరైన బంగ్లాదేశ్ కూడా విజయంపై ధీమా వ్యక్తం చేస్తోంది.

బంగ్లాదేశ్ తుది జట్టు: మష్రాఫ్ మొర్తజా(కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, ఇమ్రూల్ కైస్, షకిబుల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, షబ్బీర్ రెహ్మాన్, మొహ్ముదుల్లా, మొసదాక్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్, రూబెల్ హుస్సేన్

ఇంగ్లండ్ తుది జట్టు: ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), బెన్ స్టోక్స్, హేల్స్, జాసన్ రాయ్, జో రూట్, జాస్ బట్లర్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, ప్లంకెట్,  మార్క్ వుడ్, జాక్ బాల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement