బజరంగ్, పింకీ పసిడి పట్టు  | Bajrang takes gold; Pinki wins | Sakshi
Sakshi News home page

బజరంగ్, పింకీ పసిడి పట్టు 

Jul 30 2018 1:42 AM | Updated on Jul 30 2018 1:42 AM

 Bajrang takes gold; Pinki wins - Sakshi

టర్కీలో జరిగిన యాసర్‌ డొగు స్మారక అంతర్జాతీయ రెజ్లింగ్‌ టోర్నీలో బజరంగ్‌ 70 కేజీల విభాగంలో విజేతగా నిలిచాడు. ఫైనల్లో బజరంగ్‌తో తలపడాల్సిన ఆండ్రీ క్విటాయోస్కో (ఉక్రెయిన్‌) గాయం కారణంగా బరిలోకి దిగలేదు. 61 కేజీల విభాగం ఫైనల్లో సందీప్‌ తోమర్‌ (భారత్‌) 2–8తో యాఖెకెషి (ఇరాన్‌) చేతిలో ఓడి రజతం దక్కించుకున్నాడు.

57 కేజీల విభాగంలో విక్కీ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు.  మహిళల 55 కేజీల విభాగంలో పింకీ స్వర్ణం గెలిచింది. సీమా (53 కేజీలు), పూజా «(57 కేజీలు), రజని (72 కేజీలు)
రజతాలు...  సరిత (62 కేజీలు), సంగీత (59 కేజీలు), గీత ఫొగాట్‌ (65 కేజీలు) కాంస్యాలు నెగ్గారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement