అమెరికా స్టార్స్‌కు షాక్‌ | Australian Open: Within Hours, Top Americans Fall | Sakshi
Sakshi News home page

అమెరికా స్టార్స్‌కు షాక్‌

Jan 17 2018 1:50 AM | Updated on Aug 24 2018 5:21 PM

Australian Open: Within Hours, Top Americans Fall - Sakshi

మెల్‌బోర్న్‌: టెన్నిస్‌ సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సంచలన ఫలితాలతో హోరెత్తింది. మహిళల సింగిల్స్‌లో గతేడాది రన్నరప్, ఐదో సీడ్‌ వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా), పదో సీడ్‌ కోకో వాండెవె (అమెరికా), 13వ సీడ్, గతేడాది యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ స్లోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా), 11వ సీడ్‌ మ్లాడెనోవిచ్‌ (ఫ్రాన్స్‌) తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టారు.

 తొలి రౌండ్‌లో వీనస్‌ 3–6, 5–7తో బెన్సిచ్‌ (స్విట్జర్లాండ్‌) చేతిలో... కోకో 6–7 (4/7), 2–6తో బాబోస్‌ (హంగేరి) చేతిలో... స్లోన్‌ స్టీఫెన్స్‌ 6–2, 6–7 (2/7), 2–6తో షుయె జాంగ్‌ (చైనా) చేతిలో... మ్లాడెనోవిచ్‌ 3–6, 2–6తో బొగ్డాన్‌ (రొమేనియా) చేతిలో ఓడిపోయారు.  ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో టాప్‌ సీడ్‌ హలెప్‌ (రొమేనియా) 7–6 (7/5), 6–1తో ఐఅవా (ఆస్ట్రేలియా)పై, మూడో సీడ్‌ ముగురుజా (స్పెయిన్‌) 6–4, 6–3తో పొంచెట్‌ (ఫ్రాన్స్‌)పై, షరపోవా (రష్యా) 6–1, 6–4తో మరియా (జర్మనీ)పై గెలిచి రెండో రౌండ్‌లోకి చేరారు.  

మరోవైపు పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌), మాజీ చాంపియన్స్‌ నాదల్‌ (స్పెయిన్‌), జొకోవిచ్‌ (సెర్బియా) రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. తొలి రౌండ్‌లో టాప్‌ సీడ్‌ నాదల్‌ 6–1, 6–1, 6–1తో బర్గోస్‌ (డొమినికన్‌ రిపబ్లిక్‌)పై, రెండో సీడ్‌ ఫెడరర్‌ 6–3, 6–4, 6–3తో బెడెన్‌ (స్లొవేనియా)పై, 14వ సీడ్‌ జొకోవిచ్‌ 6–1, 6–2, 6–4తో యంగ్‌ (అమె రికా)పై గెలిచారు. అయితే ఎనిమిదో సీడ్‌ జాక్‌ సోక్‌ (అమెరికా), 11వ సీడ్‌ అండర్సన్‌ (దక్షిణాఫ్రికా), 16వ సీడ్‌ ఇస్నెర్‌ (అమెరికా) కూడా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. సుగిటా (జపాన్‌) 6–1, 7–6 (7/4), 5–7, 6–3తో జాక్‌ సాక్‌పై... ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) 6–4, 3–6, 6–3, 6–3తో ఇస్నెర్‌పై, ఎడ్మండ్‌ (బ్రిటన్‌) 6–7 (4/7), 6–3, 3–6, 6–3, 6–4తో అండర్సన్‌పై నెగ్గారు. భారత ప్లేయర్‌ యూకీ బాంబ్రీ 6–7 (4/7), 4–6, 3–6తో బగ్ధాటిస్‌ (సైప్రస్‌) చేతిలో ఓడిపోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement