టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

Australia Won Toss Elect To Bowl In 2nd Match - Sakshi

రాజ్‌కోట్‌: భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా  రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. రిషభ్ పంత్ స్థానంలో మనీశ్ పాండే, శార్దూల్ ఠాకూర్‌ స్థానంలో సైనీ జట్టులోకి వచ్చారు. తొలి వన్డేలో వన్‌సైడ్‌ విక్టరీతో టీమిండియాకు షాకిచ్చిన ఆస్ట్రేలియా.. మరో గెలుపు కోసం ఉవ్విళ్లూరుతుంది. అయితే టీమిండియాకు మాత్రం ఈ మ్యాచ్ అత్యంత కీలకం. సొంతగడ్డపై మరో సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే భారత్‌ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే. ఆసీస్ చేతిలో ఈ మ్యాచ్‌ ఓడితే టీమిండియా సొంతగడ్డపై ఆసీస్‌పై వరుసగా రెండు వన్డే సిరీస్‌లను కోల్పోయినట్లవుతుంది. తొలివన్డేలో భారత్‌ పేలవ బ్యాటింగ్‌తో పాటు పసలేని బౌలింగ్‌ జట్టును ముంచింది.(ఇక్కడ చదవండి:కోహ్లి ముంగిట రెండు రికార్డులు)

పేసర్లు సహా స్పిన్నర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ఇక రాజ్‌కోట్‌ వికెట్‌ అయితే బ్యాటింగ్‌కు స్వర్గధామం. ఇలాంటి పరిస్థితుల్లో భారత బౌలింగ్‌ కచ్చితంగా పదును కావాల్సిందే. లేదంటే ఇక్కడ మరింత భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది. మరోవైపు సిరీస్‌లో ఘనమైన విజయారంభంతో ఆస్ట్రేలియా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉంది. అదే జోరును పునరావృతం చేసి ఆఖరిదాకా ఆగకముందే సిరీస్‌ను పట్టేయాలని కసిగా ఉంది. ఓపెనర్లు వార్నర్, ఫించ్‌ అజేయమైన సెంచరీలతో దూకుడు మీదున్నారు. మిడిలార్డర్‌ స్మిత్, లబ్‌షేన్‌లతో బాగుంది. బౌలింగ్‌  విభాగం కూడా భారత బ్యాటింగ్‌కు తమ తడాకా చూపించింది. మరోమారు ఆల్‌రౌండ్‌ సత్తాతో టీమిండియాపై ఆధిపత్యం చాటాలని ఆసీస్‌ కదన కుతూహలంతో ఉంది. అయితే స్వదేశంలో జరుగుతున్న సిరీస్‌ కావడంతో పాటు కఠినమైన ప్రత్యర్థి ఆసీస్‌పై మ్యాచ్‌లో గెలిచి రేసులో నిలవాలనే పట్టుదలతో విరాట్‌ గ్యాంగ్‌ ఉంది. పూర్తి స్థాయిలో రాణించి సిరీస్‌ను కడవరకూ తీసుకురావాలనే తలంపుతో టీమిండియా బరిలోకి దిగింది. 

తుది జట్లు..

భారత్‌..
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీ, నవదీప్‌ సైనీ, కుల్దీప్‌ యాదవ్‌, బుమ్రా

ఆసీస్‌..
అరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌, లబూషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, అస్టన్‌ టర్నర్‌, అలెక్స్‌ క్యారీ, ఆస్టన్‌ ఆగర్‌, ప్యాట్‌ కమ్మిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌, ఆడమ్‌ జంపా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top