ఆసీస్ 0-2తో ఓడినప్పటికీ.. | Australia on top in ICC rankings despite 0-2 series loss to New Zealand | Sakshi
Sakshi News home page

ఆసీస్ 0-2తో ఓడినప్పటికీ..

Feb 6 2017 11:06 AM | Updated on Sep 5 2017 3:03 AM

ఆసీస్ 0-2తో ఓడినప్పటికీ..

ఆసీస్ 0-2తో ఓడినప్పటికీ..

ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ను ఆసీస్ 0-2 తో కోల్పోయినప్పటికీ, ర్యాంకింగ్స్ లో మాత్రం టాప్ను నిలబెట్టుకుంది.

దుబాయ్:ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ను ఆసీస్ 0-2 తో కోల్పోయినప్పటికీ, ర్యాంకింగ్స్ లో మాత్రం టాప్ ర్యాంకును నిలబెట్టుకుంది. ఈ సిరీస్లో ఓటమి తరువాత ఆస్ట్రేలియా 120 రేటింగ్ పాయింట్ల నుంచి 118 రేటింగ్ పాయింట్లకు దిగజారింది. దాంతో రేటింగ్ పాయింట్లలో దక్షిణాఫ్రికాతో సమంగా నిలిచింది. కాగా మ్యాచ్ ల పాయింట్ల పరంగా ముందు వరుసలో ఉన్న ఆసీస్ తన నంబర్ వన్ స్థానాన్ని కాపాడుకుంది.

 

మరొకవైపు వన్డేల్లో తొలిసారి ప్రథమ స్థానాన్ని దక్కించుకోనే అవకాశం దక్షిణాఫ్రికా ముందుంది. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన పక్షంలో దక్షిణాఫ్రికా నంబర్ వన్ స్థానానికి చేరుతుంది. ఇప్పటికే మూడు వన్డేలు గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు.. ఇక మిగిలిన రెండు వన్డేల్లో విజయం సాధిస్తే కొత్త చరిత్రను లిఖిస్తుంది. మరొకవైపు ఆసీస్ పై సిరీస్  గెలిచిన న్యూజిలాండ్ మూడో స్థానానికి చేరింది. దాంతో భారత్ జట్టు ఒక పాయింట్ దిగజారి నాల్గో స్థానానికి పరిమితమైంది.

Advertisement
 
Advertisement
Advertisement