సూపర్‌ స్టార్క్‌ ఆసీస్‌కు ఏడో విజయం | Australia beat New Zealand by 86 runs | Sakshi
Sakshi News home page

సూపర్‌ స్టార్క్‌ ఆసీస్‌కు ఏడో విజయం

Jul 1 2019 5:52 AM | Updated on Jul 1 2019 5:52 AM

Australia beat New Zealand by 86 runs - Sakshi

లండన్‌: ఇప్పటికే సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖాయం చేసుకున్న డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా ప్రపంచకప్‌లో తమ జోరు కొనసాగిస్తోంది. న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన డేనైట్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ 86 పరుగుల తేడాతో గెలిచి ఈ టోర్నీలో ఏడో విజయాన్ని నమోదు చేసుకుంది. 244 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ను ఆసీస్‌ పేసర్‌ మిషెల్‌ స్టార్క్‌ (5/26) హడలెత్తించాడు. స్టార్క్‌ ధాటికి న్యూజిలాండ్‌ 43.4 ఓవర్లలో 157 పరుగులకే కుప్పకూలి ఓటమి చవిచూసింది. ఆసీస్‌ మిగతా బౌలర్లలో బెహ్రాన్‌డార్ఫ్‌కు రెండు వికెట్లు దక్కగా... కమిన్స్, లయన్, స్టీవ్‌ స్మిత్‌ ఒక్కో వికెట్‌ తీశారు. తమ చివరి రౌండ్‌ మ్యాచ్‌ల్లో జూలై 6న దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా; జూలై 3న ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్‌ తలపడతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement