ఆస్ట్రేలియాకు ముత్తయ్య పాఠాలు | Australia appoint Muralitharan as consultant for Lanka series | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాకు ముత్తయ్య పాఠాలు

Jul 14 2016 6:47 PM | Updated on Nov 9 2018 6:43 PM

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు శ్రీలంక మాజీ దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పాఠాలు చెప్పడానికి సిద్ధమయ్యాడు.

కొలంబో:ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు శ్రీలంక మాజీ దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పాఠాలు చెప్పడానికి సిద్ధమయ్యాడు. త్వరలో శ్రీలంకలో పర్యటించనున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కన్సల్టెంట్ గా వ్యవహరించేందుకు మురళీ ఒప్పందం చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ధృవీకరించాడు.

 

'ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు మురళీ సలహాదారుడిగా వ్యవహరించనున్నాడు. దిగ్గజ స్పిన్నర్ తో సీఏ ఒప్పందం చేసుకుంది. మా యువ స్పిన్నర్లతో మురళీ పని చేస్తాడు. ఇప్పటికే శిక్షణా శిబిరంలో ఉన్న మా జట్టుతో మురళీ కలిశాడు. శ్రీలంక పిచ్ లపై  మురళీకున్న ఆపార అనుభవం మాకు ఉపయోగపడుతుంది. దాంతో పాటు అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో మురళీ అత్యధిక వికెట్లు సాధించాడు.అతనితో కలిసి పని చేయడం మా యువ స్పిన్నర్ల అదృష్టం'అని స్మిత్ తెలిపాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement