ఆసీస్‌ నడ్డివిరిచిన కృనాల్‌.. భారత్‌ లక్ష్యం 165 | Australi Set Targrt Of 165 Runs Against India | Sakshi
Sakshi News home page

కృనాల్‌ దెబ్బకు ఆసీస్‌ విలవిల

Nov 25 2018 3:08 PM | Updated on Nov 25 2018 3:08 PM

 Australi Set Targrt Of 165 Runs Against India - Sakshi

కృనాల్‌ పాండ్యా

భారత ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా బంతితో చెలరేగాడు..

సిడ్నీ : మూడు టీ20 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టీ20లో భారత ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా బంతితో చెలరేగాడు. తొలి మ్యాచ్‌లో దారుణంగా పరుగులు సమర్పించుకోని విమర్శలపాలైన కృనాల్‌.. ఈ మ్యాచ్‌లో రాణించి లెక్కసరిచేశాడు. కృనాల్‌ దెబ్బకు ఆసీస్‌.. భారత్‌కు 165 పరుగుల సాధారణ లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ను కృనాల్‌ (4/36) దెబ్బతీశాడు. ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌లో.. డీఆర్సీ షార్ట్‌ (33), ఆరోన్‌ ఫించ్‌ (28), క్యారీ (27), స్టోయినిస్‌ (25 నాటౌట్‌)లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లకు ఆసీస్‌ ఆరు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కృనాల్‌కు నాలుగు, కుల్దీప్‌ ఒక వికెట్‌ దక్కింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement