పాక్ ప్రభుత్వం భారత్‌తో మాట్లాడాలి | Atmosphere is not conducive for India, Pakistan series: Anurag Thakur | Sakshi
Sakshi News home page

పాక్ ప్రభుత్వం భారత్‌తో మాట్లాడాలి

Oct 26 2015 2:53 AM | Updated on Sep 3 2017 11:28 AM

పాక్ ప్రభుత్వం భారత్‌తో మాట్లాడాలి

పాక్ ప్రభుత్వం భారత్‌తో మాట్లాడాలి

ప్రస్తుతం భారత్, పాకిస్తాన్‌ల మధ్య క్రికెట్ జరిగేందుకు అనువైన పరిస్థితులు లేవని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.

బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్
ప్రస్తుతం భారత్, పాకిస్తాన్‌ల మధ్య క్రికెట్ జరిగేందుకు అనువైన పరిస్థితులు లేవని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య మంచి వాతావరణం నెలకొనేలా చూడటం అన్నికంటే ముఖ్యమైందన్నారు. ‘రెండు దేశాల మధ్య క్రికెట్ ఆడేందుకు అవసరమైన పరిస్థితులు ఇప్పుడైతే లేవు. మొదట పాక్ ప్రభుత్వం భారత ప్రభుత్వంతో మాట్లాడాలి. ఇరుదేశాల మధ్య మంచి వాతావరణం నెలకొనేందుకు ఇది దోహదపడుతుంది. ప్రభుత్వాలు మాట్లాడుకుంటే రెండు బోర్డుల మధ్య పెద్దగా చర్చలు కూడా అవసరం లేదు’ అని ఠాకూర్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement