మనోళ్లు న్యూజిలాండ్ను తిప్పేస్తున్నారు.. | aswin, jadeja shine in kanpur test | Sakshi
Sakshi News home page

మనోళ్లు న్యూజిలాండ్ను తిప్పేస్తున్నారు..

Sep 24 2016 11:46 AM | Updated on Oct 17 2018 4:43 PM

మనోళ్లు న్యూజిలాండ్ను తిప్పేస్తున్నారు.. - Sakshi

మనోళ్లు న్యూజిలాండ్ను తిప్పేస్తున్నారు..

న్యూజిలాండ్తో తొలిటెస్టు మూడో రోజు శనివారం భారత స్పిన్నర్లు రాణిస్తున్నారు.

కాన్పూర్: న్యూజిలాండ్తో తొలిటెస్టు మూడో రోజు శనివారం భారత స్పిన్నర్లు రాణిస్తున్నారు. ఆట ఆరంభమైన కాసేపటికే అశ్విన్, జడేజా వెంటవెంటనే మూడు వికెట్లు పడగొట్టి కివీస్కు షాకిచ్చారు. 152/1 ఓవర్నైట్ స్కోరుతో న్యూజిలాండ్ ఆటగాళ్లు లాథమ్, విలియమ్సన్ ఈ రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించారు.

న్యూజిలాండ్ మరో 7 పరుగుల తర్వాత వికెట్ కోల్పోయింది. అశ్విన్ లాథమ్ను అవుట్ చేశాడు. ఆ మరుసటి ఓవర్లో జడేజా.. టేలర్ను డకౌట్ చేశాడు.  వీరిద్దరూ ఎల్బీగా వెనుదిరిగారు. కాసేపటి తర్వాత అశ్విన్ విలియమ్సన్ను బౌల్డ్ చేశాడు.  అనంతరం ల్యూక్ రోంచీ(33)ను ఎల్బీ డబ్యూగా జడేజా పెవిలియన్కు పంపాడు. దీంతో కివీస్ 219 పరుగుల వద్ద ఐదో వికెట్ ను కోల్పోయింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 318 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement