
మస్కట్ (ఒమన్): చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై భారత్ మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు 3–1 గోల్స్ తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. భారత్ తరఫున మన్‌ప్రీత్ సింగ్ (24వ నిమిషంలో), మన్‌దీప్ సింగ్ (31వ ని.లో), దిల్‌ప్రీత్ సింగ్ (42వ ని.లో) ఒక్కో గోల్ చేశారు.
పాకిస్తాన్‌కు ఇర్ఫాన్ జూనియర్ మొహమ్మద్ (1వ ని.లో) ఏకైక గోల్‌ను అందించాడు. ఈ మ్యాచ్‌తో భారత గోల్‌కీపర్ శ్రీజేశ్ కెరీర్‌లో 200వ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. పాక్‌పై భారత్‌కిది వరుసగా 11వ విజయం కావడం విశేషం. భారత్ చివరిసారి 2016 దక్షిణాసియా క్రీడల ఫైనల్లో 1–2తో పాక్ చేతిలో ఓడింది. నేడు జరిగే మూడో లీగ్ మ్యాచ్‌లో జపాన్‌తో భారత్ ఆడుతుంది.